ప్రత్యేక పూజలు నిర్వహించిన జడ్పి చైర్ పర్సన్, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ 

ప్రత్యేక పూజలు నిర్వహించిన జడ్పి చైర్ పర్సన్, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ 

ముద్ర ప్రతినిధి, జగిత్యాల:  హనుమాన్ జయంతిని పురస్కరించుకొని జగిత్యాల జిల్లా కేద్రంలోని పలు హనుమాన్ దేవాలయాలలో భక్తులు స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పట్టణంలోని  శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. 

బీరుపూర్ మండలంలో శ్రీ శివ పంచాయతన నవగ్రహ ద్వజస్తంభ సహిత శ్రీ ఆంజనేయ స్వామి వార్ల విగ్రహ ప్రతిష్ట ఉత్సవాల్లో జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. బీర్పూర్ మండలం తుంగూర్ గ్రామంలో నూతన హనుమాన్ ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.