విద్యతో పాటు ఆత్మరక్షణకు కరాటే తప్పనిసరి

విద్యతో పాటు ఆత్మరక్షణకు కరాటే తప్పనిసరి

వేసవి కరాటే శిక్షణ శిబిరం ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే 
ముద్ర ప్రతినిధి, జగిత్యాల: విద్యార్థులకు విద్యతో పాటు ఆత్మరక్షణకు కరాటే తప్పనిసరి జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ అన్నారు. జగిత్యాల పట్టణంలొని శుభమస్తు ఫంక్షన్ హాల్లో ఒకినావా మార్షల్ ఆర్ట్ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న  వేసవి కరాటే శిక్షణ శిబిరాన్ని జిల్లా యువజన సర్వీసులు, క్రీడల అభివృద్ధి అధికారి డాక్టర్ నరేష్ తో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కరాటే ఆత్మరక్షణ కోసమేకాకుండా, శారీరక, మానసిక దృఢత్వాన్ని ఇస్తుందన్నారు.

కరాటేతో ఏకాగ్రత,ఆత్మ విశ్వాసం పెరిగి చదువులో సైతం రాణించే అవకాశం ఉందని,ప్రస్తుత సమాజం లో జరుగుతున్న అఘాత్యాలను దృష్టిలో ఉంచుకొని అమ్మాయిలు తప్పకుండ కరాటే నేర్చుకోవాలన్నారు.ఈ కార్యక్రమంలో కరాటే అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు, కోచ్ మర్రిపెల్లి శ్రీనివాస్, కౌన్సిలర్ జుంబర్తి రాజ్ కుమార్, ఏఎంసి చైర్మన్ నక్కల రాధా రవీందర్ రెడ్డి, ఎఫ్ సిఎస్  డైరెక్టర్ పవన్, యం ఏ అరిఫ్, కరాటే సీనియర్ మాస్టర్ ఎం లింగయ్య, అనంతుల కాంతారావు, కె భూమేష్, టి నరేష్, ఎ సంతోష్, గొల్లపెల్లి శృతి, తదితరులు పాల్గొన్నారు.