కొండగట్టు సమీపంలో... రైల్వే ట్రాక్ వద్ద గుర్తు తెలియని మృతదేహం...

కొండగట్టు సమీపంలో... రైల్వే ట్రాక్ వద్ద గుర్తు తెలియని మృతదేహం...

ముద్ర, మల్యాల: కొండగట్టు సమీపంలో రైల్వే ట్రాక్ వద్ద గురువారం గుర్తు తెలియని మృతదేహాన్ని స్థానికులు గుర్తించి, రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. వివరాల్లోకి వెళ్తే... కొండగట్టు సమీపంలోని రైల్వే ట్రాక్ వద్ద మగశవం సగభాగం (నడుము నుంచి కాళ్ళ వరకు) పూర్తిగా కుళ్ళిన స్థితిలో ఉన్న మృతదేహాన్ని గుర్తించినట్లు మంచిర్యాల రైల్వే పోలీస్  సిబ్బంది తిరుపతి తెలిపారు. మృతదేహానికి ఘటన స్థలంలోనే జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుడుతో పోస్ట్ మార్టం నిర్వహించినట్లు పేర్కొన్నారు. మృతుడు బ్లూ కలర్ జీన్స్ పాయింట్ వేసుకున్నట్లు, మృతదేహంపై ఎవరికైనా అనుమానం కల్గితే మంచిర్యాల రైల్వే పోలీసులకు సమాచారం అందించాలని ఆయన కోరారు.