ప్రభుత్వ మాత  శిశు ఆసుపత్రిలో శిశువు మృతి 

ప్రభుత్వ మాత  శిశు ఆసుపత్రిలో శిశువు మృతి 

ఘటనను నిరసిస్తూ ఆసుపత్రిలో బిజేపి నాయకుల ధర్నా 
ముద్ర ప్రతినిధి, జగిత్యాల : జగిత్యాల జిల్లా కేద్రంలోని ప్రభుత్వ మాత శిశు ఆసుపత్రిలో గర్బస్థ శిశువు మృతి చెందగా, వైద్యుల నిర్లక్ష్యం కారణమంటూ కుటుంబ సభ్యులతో కలసి బిజేపి నాయకులు ఆసుపత్రిలో ధర్నాకు దిగారు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం మల్లాపూర్ గ్రామానికి చెందిన కోలా జమున ప్రసవం కోసం బుధవారం ఉదయం జగిత్యాల పట్టణంలోని ప్రభుత్వ మాత  శిశు ఆసుపత్రికి వచ్చింది. పరీక్షించిన వైద్యులు జమునను ఆసుపత్రిలో చేర్పించుకొని గురువారం ఉదయం డెలివరి చేశారు. జమున ఆడ మృత శిశువుకు జన్మనిచ్చింది. దీంతో వైద్యుల నిర్లక్షం కారణంగానే ఇలా జరిగిందని కుటుంబ సభ్యులతో కలిసి బిజేపి నాయకుడు పన్నాల తిరుపతి రెడ్డి అధ్వర్యంలో ఆసుపత్రిలో ధర్నాకు దిగారు. విషయం తెలుకున్న రూరల్ సిఐ అరిఫ్ అలీఖాన్   ఆసుపత్రికి వచ్చి వారితో మాట్లాడి అందోళన విరమింప చేసే ప్రయత్నం చేశారు. చివరకు దరకాస్తు ఇస్తే భాధ్యులఫై విచారణ జరిపి కేసు నమోదు చేస్తామని సిఐ హామీ ఇవ్వడంతో ఆందోళన విరమిచారు. తిరుపతి రెడ్డి మాట్లాడుతూ ఈ ఆసుపత్రిలో ఇది అరవ సంఘటన అని అయినప్పటికి వైద్యులు నిర్లక్షధోరణిలో మార్పు లేదన్నారు. ఇప్పటికి అయిన బాధ్యులు అయిన వైద్యులుఫై చర్యలు తీసుకోని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసి బాధితులకు న్యాయం చేయాలనీ డిమాండు చేశారు. ఈ కార్యక్రమంలో బిజేపి అసెంబ్లీ కన్వినర్ మదనమోహన్, బిజేవైయం సారంగాపూర్ మండల అధ్యక్షుడు దీటీ వెంకటేష్, సామల సతీష్, మోహన్ రెడ్డి సతీష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.