జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ముందు హనుమాన్ చాలీసా పఠించి బిజెపి నిరసన

జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ముందు హనుమాన్ చాలీసా పఠించి బిజెపి నిరసన

ముద్ర ప్రతినిధి, మెదక్: కర్ణాటక ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ న మేనిఫెస్టోలో హిందువులను కించపరుస్తూ తాము అధికారంలోకి వస్తే బజరంగ్దళ్ ని షేధిస్తామని పేర్కొనడాన్ని నిరసిస్తూ శుక్రవారం మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ముందు బిజెపి మెదక్ జిల్లా అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్  ఆధ్వర్యంలో హనుమాన్ చాలీసా పారాయణం చేశారు.  కాంగ్రెస్ పార్టీ ఆహంకారానికి నిదర్శనమన్నారు. ఓటు బ్యాంకు రాజకీయాలు, ముస్లింల ఓట్లను దండుకునేందుకు ఈ కుట్రలు పడుతున్నారన్నారు. దీన్ని నిరసిస్తూ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ పిలుపుమేరకు హనుమాన్ చాలీసా పారాయణం పటిస్తూ తమ నిరసన తెలియజేయడం జరుగుతుందని గడ్డం శ్రీనివాస్ పేర్కొన్నారు.

కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ఒక వర్గం యొక్క ఓట్లను దండుకోవడానికి హిందువుల మనోభావాలను కించపరుస్తూ బజరంగ్దళ్ ను నిషేధిస్తామని చెప్పడం బాధాకరమని, ఈ వ్యాఖ్యలు దేశంలోనే కాకుండా ప్రపంచంలో ఉన్న హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉన్నాయన్నారు. ఈ హనుమాన్ చాలీసా పారాయణం వలన కాంగ్రెస్ పార్టీ నాయకులకు జ్ఞానోదయం కలగాలని, ఇకముందు భవిష్యత్తులో హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా మాట్లాడకుండా జాగ్రత్తగా ఉండాలని, ఒకవేళ ఇటువంటి ఘటనలు పునారావృతమైతే కాంగ్రెస్ పార్టీని ఈ భూ ప్రపంచంలోనే ఉండకుండా చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నందు జనార్దన్ రెడ్డి, హై కోర్టు న్యాయవాది తాళ్లపల్లి రాజశేఖర్, ప్రధాన కార్యదర్శి నల్లాల విజయ్ కుమార్, జిల్లా ఉపాధ్యక్షులు బైల సత్యనారాయణ,  అసెంబ్లీ కన్వీనర్ ఎక్కల దేవి మధు, దుబ్బాక అసెంబ్లీ కో కన్వీనర్ గోవిందు, జిల్లా అధికార ప్రతినిధి నందా రెడ్డి,  పట్టణ అధ్యక్షులు నాని ప్రసాద్, కిసాన్ మోర్చా అధ్యక్షులు జనగామ మల్లారెడ్డి, మహిళా మోర్చా అధ్యక్షురాలు బెండవీణ, మండల అధ్యక్షులు ప్రభాకర్, సంతోష్ చారి, రంజిత్ రెడ్డి, చంద్రశేఖర్,మహేష్, వమోర్చా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పోలీసులు సముదాయించి బిజెపి నాయకులు పంపించారు.