మెదక్ జిల్లా చార్మినార్ జోన్ లో కలపాలి

మెదక్ జిల్లా చార్మినార్ జోన్ లో కలపాలి

న్యాయవాది ప్రశాంత్ డిమాండ్
ముద్ర ప్రతినిధి, మెదక్: మెదక్ జిల్లాను చార్మినార్ జోన్ లో కలిపి ఉద్యోగ నోటిఫికేషన్ ను విడుదల చేయాలని న్యాయవాది ప్రశాంత్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం మెదక్ పట్టణంలో స్థానిక విలేకరులతో మాట్లాడుతూ.. మెదక్ జిల్లాకు రాజన్న సిరిసిల్ల జోన్ లో కలపడం వల్ల విద్యార్థులు, నిరుద్యోగులు, ఉద్యోగులకు తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయని తెలిపారు.

ప్రస్తుతం రాజన్న సిరిసిల్ల జోన్ లో కొనసాగుతున్న మెదక్ జిల్లాను చార్మినార్ జోన్ లో కలపాలని డిమాండ్ చేశారు. నూతనంగా ఏర్పాటు అయిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మెదక్ జిల్లాను చార్మినార్ జోన్ లో కలుపుతూ ఉద్యోగ నోటిఫికేషన్ ను విడుదల చేయాలని కోరారు. అదేవిధంగా గత ప్రభుత్వం ఉద్యోగులను ఇబ్బంది పెట్టే విధంగా తీసుకొచ్చిన 317 జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో చిరంజీవి, శ్రీకాంత్, ఈశ్వర్, భాను, వెంకటేష్, హరికాంత్ తదితరులు ఉన్నారు.