నివాళులర్పించిన మంత్రి, ఎమ్మెల్యే

నివాళులర్పించిన మంత్రి, ఎమ్మెల్యే

ముద్ర ప్రతినిధి, మెదక్: ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యక్తిగత కార్యదర్శి రాజశేఖర్ రెడ్డి తల్లి రత్నమ్మ(80) అనారోగ్యంతో   హైదరాబాదులో మృతి చెందారు. రత్నమ్మ స్వగ్రామమైన  రామాయంపేట  మండల పరిధిలోని డి. ధర్మారంలో  అంత్యక్రియలకు  ఏర్పాటు చేశారు.విషయం తెలుసుకున్న రాష్ట్ర ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి  హరీష్ రావు, మెదక్ ఎమ్మెల్యే ఎం. పద్మ దేవేందర్ రెడ్డి, ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్ రెడ్డి, నాయకులు తిరుపతిరెడ్డి  డి. ధర్మారం చేరుకొని  రత్నమ్మకు నివాళులర్పించారు. రాజశేఖర్ రెడ్డి కుటుంబ సభ్యులను ఓదార్చారు.