విద్యార్ధినీలకు న్యాయమూర్థుల అవగాహన

విద్యార్ధినీలకు న్యాయమూర్థుల అవగాహన

ముద్ర ప్రతినిధి, మెదక్: జిల్లా ప్రధాన న్యాయమూర్తి సంస్థ మెదక్ పి. లక్ష్మీ శారద  సూచనల మేరకు మెదక్ వెస్లీ ఉన్నత పాఠశాలలో అంతర్జాతీయ బాలిక దినోత్సవం నిర్వహించారు. ముఖ్య అతిధిగా జూనియర్ సివిల్ జడ్జి రిటా లాల్ చంద్ పాల్గొని చైల్డ్ మ్యారేజ్ ఫ్రీ ఇండియా కాంపెయిన్ నిర్వహించారు. ఆడపిల్లలకు కనీస వయసు వచ్చిన తర్వాతే పెళ్లి చేసుకోవాలని వివరించారు. చైల్డ్ ప్రొటెక్షన్ , చైల్డ్ మ్యారేజస్ యాక్ట్ పైన విద్యార్థులందరితో ప్రతిజ్ఞ చేయించారు. మైనర్ వివాహలు,  కనీస వయసు రాకముందే పెల్లి చేసుకుంటే దాని వల్ల కలిగే ఇబ్బందుల గురించి వివరించారు. వివిధ  చట్టాలపైన అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు  మార్కం సిద్దిరాములు, వి. నర్సింలు, సక్రు బాయి, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు,  సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు.

రెసిడెన్సియల్ స్కూల్ లో మెదక్ రెసిడెన్సియల్ స్కూల్ లో  జూనియర్ సివిల్ జడ్జి, స్పెషల్ మొబైల్ కోర్టు మేజిస్ట్రేట్ కల్పన ఇంటర్నేషనల్ గర్ల్ చైల్డ్ డే సందర్బంగా ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్సియల్ స్కూల్ లో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. పాఠశాల విద్యార్థినిలకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి, పోక్సో యాక్ట్, చైల్డ్ మ్యారేజెస్ గురించి, ఆపదలో ఉన్న పిల్లలు పోలీస్ 100కి, చైల్డ్ హెల్ప్ లైన్ నంబర్ 1098కి ఫోన్ చేయాలని, పిల్లల హక్కులు, రక్షణ, అవసరాలు, ఇతర చట్టాలపైన అవగాహన కల్పించారు. పిల్లల గోల్స్, ఫిజికల్ ఆక్టివిటీస్, ఆసనాలు, రోజు వారి ప్రణాళికను అడిగి తెలుసుకున్నారు.  చైల్డ్ మ్యారేజ్ ఫ్రీ ఇండియా కాంపెయిన్ ప్రతిజ్ఞ చేయించారు. పాఠశాల ప్రిన్సిపాల్ హిమబిందు, జూనియర్ వైస్ ప్రిన్సిపాల్ సంధ్యారాణి,
న్యాయవాది సిద్దగౌడ్,  సఖి కేంద్రం రేణుక, కైలాష్ తదితరులు పాల్గొన్నారు.