పోలీస్ అదుర్స్

పోలీస్ అదుర్స్

ప్రకృతి వైపరీత్యంలోనూ నేనున్నానంటూ కదిలిన రేగొండ ఎస్ ఐ శ్రీకాంత్ 

ముద్ర న్యూస్ రేగొండ: తీవ్రమైన ఈదురు గాలుల వల్ల రేగొండ మండలంలోని ప్రధాన  రహదారికి ఇరువైపులా  ఉన్న పెద్ద పెద్ద వృక్షాలు పవర్ లైన్స్ రోడ్డుపై  విరిగిపడగా రాకపోకలకు అంతరాయం కలిగింది.ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడలని ఈ మేరకు వెంటనే స్పందించిన రేగొండ ఎస్ ఐ, శ్రీకాంత్ రెడ్డి,  రెండు జె.సి.పిలు డోజార్స్ 3 ట్రాక్టర్లు హుటాహుటిన సంఘటన స్థలానికి తెప్పించి ప్రజలకు రాకపోకలకు ఇబ్బంది కలగకుండా రోడ్డుపై విరిగిపడ్డ  వృక్షాలను తొలగించారు.

పవర్ లైన్స్ మరియు కరెంటు స్తంభాలను సైతం తగిన జాగ్రత్తలతో  ఎవరికి హాని కలగకుండా తొలగించడం జరిగింది. రహదారిపై వెళ్తున్న ప్రజలు పోలీస్ వ్యవస్థ వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించినందుకుగాను  ఎస్ఐ కి కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో  ఏ ఎస్సై  కానిస్టేబుళ్లు సహకరించారు.