కెసిఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేసిన మెప్మా ఉద్యోగులు

కెసిఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేసిన మెప్మా ఉద్యోగులు

ముద్ర ప్రతినిధి, మెదక్:ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తుందని మెదక్ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మెప్మా ఉద్యోగస్తులకు వేతనాలు పెంచిన సందర్భంగా మెదక్ మున్సిపల్ మెప్మా ఉద్యోగస్తులు శుక్రవారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కెసిఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... గతంలో మెప్మా ఉద్యోగస్తులకు  రూ.4,000 వేతనం ఉండగా...వారి శ్రమను గుర్తించిన ముఖ్యమంత్రి కేసీఆర్ రూ. 6,000 పెంచినట్లు చెప్పారు. మరింత ఉత్సాహంగా విధులు నిర్వహించాలని వారిని కోరారు. ఈ కార్యక్రమంలో మెదక్ మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, మాజీ వైస్ చైర్మన్ రాగి అశోక్ తదితరులు పాల్గొన్నారు.

బిఆర్ఎస్ లో చేరికలు

వివిధ పార్టీలకు చెందిన కార్యకర్తలు, నాయకులు ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డికి మద్దతుగా నిలుస్తూ బిఆర్ఎస్ లో చేరారు. శుక్రవారం మండల పరిధిలోని గాజిరెడ్డిపల్లికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మెదక్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి తరలివచ్చారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన గోండ్లే పెద్ద సత్తయ్య, ప్రవీణ్, సాయిబాబా రమేష్, కిష్టయ్య,అంజయ్య, రాజు, అంబాద్రి, సిద్ది రాములు, కిషోర్, జనార్ధన్,మహేష్, సాయిలు,మైపాల్,వెంకట్ రాములు, యాదగిరి,తులసి రామ్, రవి లాల్ తోపాటు 50 మంది పార్టీలో చేరారు. వీరికి మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని, మరింత అభివృద్ధి చెందాలంటే మరోసారి ఎమ్మెల్యేగా  గెలిపించుకోవాలన్న ఉద్దేశంతో పార్టీలో చేరుతున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్ పర్సన్ లావణ్య రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి తదితరులున్నారు.