వనదుర్గా ప్రాజెక్ట్ ఓవర్ ఫ్లో

వనదుర్గా ప్రాజెక్ట్ ఓవర్ ఫ్లో

ముద్ర ప్రతినిధి, మెదక్:మెదక్ జిల్లాలో గల మధ్య తరహా నీటి ప్రాజెక్టు అయిన వనదుర్గా ఆనకట్ట పొంగుతుంది. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో ఎగువ నుండి వస్తున్న వరదతో నిండుకుండలా మారి బుధవారం ఉదయం నుండి పొంగుతుంది. ఎగువ 1000 క్యూసెక్కుల నీరు వస్తున్నట్లు మెదక్ ఇరిగేషన్ డిఈ శివనాగరాజు తెలిపారు. వర్షాలతో మెదక్ జిల్లాలో కాలువలు పారుతున్నాయి,  చెరువులు నిండుకుంటున్నాయి. ఆయకట్టు పరిధిలో జోరుగా వరి నాట్లు సాగుతున్నాయి. చెరువులు, కుంటల కింద, బోర్ల వద్ద సైతం వరినాట్లు ముమ్మరంగా వేస్తున్నారు. దమ్ము చక్రాల రేట్లు, కూలీ విపరీతంగా పెంచేశారు.