ముగిసిన పుష్కరాలు -కిక్కిరిసిన గురుడ గంగా

ముగిసిన పుష్కరాలు -కిక్కిరిసిన గురుడ గంగా

బిజెపి జిల్లా అధ్యక్షులు గడ్డం ప్రత్యేక పూజలు
ముద్ర ప్రతినిధి, మెదక్: మెదక్ జిల్లా పేరూరరు సమీపంలో ఉత్తరవాహిని గరుడ గంగా పుష్కరాలు బుధవారం ముగిశాయి.  చివరి రోజు గజ్వేల్, ప్రజ్ఞాపూర్, కరీంనగర్, కోరుట్ల,హైదరాబాద్, నిజామాబాద్ తదితర ప్రాంతాల నుండి అధిక సంఖ్యలో ప్రజలు తరలివచ్చి పుష్కర స్నానం ఆచరించారు. 


మెదక్ జిల్లా బిజెపి అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్ గరుడ గంగా పుష్కర స్నానం ఆచరించి అమ్మవారిని దర్శించుకున్నారు.  గత 12 రోజులుగా పుష్కర స్నానాలకు వస్తున్న భక్తులకు అన్నదానం నిర్వహించగా మెదక్ సత్యసాయి సేవ సమితి సభ్యులు తమ సేవలు అందించారు.నిత్యం సాయంత్రం గంగ హారతి నిర్వహించారు. మంజునాథడికి 108 కలశాలతో అభిషేకం జరిపారు. 20 అడుగుల ఎత్తులో  వెండి కొండ సెట్టింగ్లో ఏర్పాటు చేసిన శివుడి విగ్రహం భక్తులను అకట్టుకుంది. భక్తులు పెద్దలకు పిండ ప్రకధానం చేశారు.

ఆలయ వ్యవస్థపకులు దోర్బల రాజమౌళి శర్మ, గుణాకర్ శర్మ, మహేష్ శర్మ ఆధ్వర్యంలో  పుష్కర ఉత్సవాలు గత 12 రోజులుగా
ఎలాంటి ఇబ్బందుల్

లేకుండా జరిపారు. వివిధ రూపల్లో సహకరించిన వారికి కృతజ్ఞతలు తెలిపారు.