ఉప సర్పంచ్ మృతి.. ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి సంతాపం

ఉప సర్పంచ్ మృతి.. ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి సంతాపం

పెద్దశంకరంపేట, ముద్ర: మండల పరిధిలోని శివాయ పల్లి గ్రామ ఉప సర్పంచ్ కె.బాగయ్య (60) మంగళవారం ఉదయం అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న స్థానిక నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి శివాయపల్లి చేరుకుని ఆయన భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. ఆయన వెంట ఎంపిపి జంగం శ్రీనివాస్, మండల బీఅర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మురళి పంతులు, సర్పంచ్ నరేష్, నాయకులు రమేష్, అంజయ్య, యాదుల్ తదితరులు పాల్గొన్నారు.