ఉరేసుకుని బాలుడు ఆత్మహత్య

ఉరేసుకుని బాలుడు ఆత్మహత్య

పెద్ద శంకరంపేట, ముద్ర: పెద్దశంకరంపేట పట్టణం ఇందిరా కాలనీలో నివాసముంటున్న సంకు శివ(14) నివాసంలో సోమవారం దూలానికి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో అల్లాదుర్గ్ సిఐ జార్జ్, ఎస్సై బాలరాజ్, సంఘటన స్థలాన్ని సందర్శించి మృతదేహాన్ని పరిశీలించారు.  కేసు నమోదు చేసి పోస్టుమార్టం  నిమిత్తం జోగిపేట  ఆసుపత్రికి తరలించారు. మృతునికి తండ్రి శంకరయ్య, తల్లి లక్ష్మి, ఒక తమ్ముడు, ఇద్దరు చెల్లెల్లు ఉన్నారు. తండ్రి ఫిర్యాదు మేరకు స్థానిక ఎస్సై బాలరాజ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.