బస్సుల కోసం రోడ్డెక్కిన విద్యార్థులు

బస్సుల కోసం రోడ్డెక్కిన విద్యార్థులు

ముద్ర ప్రతినిధి, మెదక్: బస్సుల కోసం విద్యార్థులు రోడ్డెక్కారు. మెదక్ -కామారెడ్డి జిల్లా సరిహద్దులో గల హవెలి ఘనపూర్ మండలం పోచమ్మరాల్ తండా వద్ద మంగళవారం ఉదయం రాస్తారోకో చేపట్టారు. తమకు బస్సులు నడవకపోవడంతో  పాఠశాలలు, కళాశాలలకు వెళ్ళలేని పరిస్థితి నెలకొందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. తల్లి దండ్రులు సైతం రోడ్డెక్కారు. ఆర్టీసీ అధికారులు స్పందించి వెంటనే బస్సులు నడపాలని డిమాండ్ చేశారు. రాస్తారోకోతో ఇరువైపులా వాహనాలు నిలిచిపోయాయి. అక్కడినుంచే  కొందరు ఎమ్మెల్సీ శేరీ సుభాష్ రెడ్డికి విషయం తెలుపగా డీఎంతో  మాట్లాడతానన్నారు. రాస్తారోకో చేస్తున్న విషయం తెలుసుకుని హవెలి ఘనపూర్ ఎస్ఐ ఆనంద్ గౌడ్ అక్కడి చేరుకొని వారితో మాట్లాడారు. ఆర్టీసి అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని, రోడ్డుపై చేయడం వల్ల ఇతరులకు అసౌకర్యం కలుగుతుందన్నారు. పోలీసులు నచ్చజెప్పడంతో విరమించారు.