చర్చి, ఏడుపాయల సందర్శించిన హై కోర్టు సిజె ఉజ్జల్ భూయాన్

చర్చి, ఏడుపాయల సందర్శించిన హై కోర్టు సిజె ఉజ్జల్ భూయాన్

ముద్ర ప్రతినిధి, మెదక్: ఆసియాలో ప్రసిద్ధి చెందిన మెదక్ చర్చిని హై కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉజ్జల్ భూయాన్ కుటుంబ సమేతంగా సందర్శించారు. శనివారం సాయంత్రం రాగా ఆలయ గురువులు, చర్చి పాస్టరేట్ కమిటీ సభ్యులు స్వాగతం పలికారు. అనంతరం  ప్రత్యేక ప్రార్థనలు చేసి, చర్చి ప్రాశస్త్యతను పాస్టర్ తెలిపారు. ఆయనతోపాటు హై కోర్టు న్యాయమూర్తులు నవీన్ రావు, సంతోష్ రెడ్డి కుటుంబ సమేతంగా చర్చిని సందర్శించారు. వారికి ఆలయ గురువులు, కమిటి సభ్యులు శాలువా, జ్ఞాపికాలతో సత్కరించారు.

ఏడుపాయల సందర్శన
తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయల వన దుర్గా మాత అమ్మవారిని హై కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉజ్జల్ భూయాన్ కుటుంబ సమేతంగా దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఈఓ సారా శ్రీనివాస్ ఆధ్వర్యంలో రాజపురం నుండి పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. తీర్థప్రసాదాలు అందజేసి, శాలువాతో సన్మానించి అమ్మవారి చిత్రపటం బహుకరించారు. ఈ కార్యక్రమంలో అడ్వొకేట్ జనరల్ బి.వి.ప్రసాద్ రావు, న్యాయమూర్తులు, న్యాయవాదులు,  తదితరులు పాల్గొన్నారు.

ఘనస్వాగతం
ప్రధాన న్యాయమూర్తి ఉజ్జల్ భూయాన్ మెదక్ లో ఘనస్వాగతం పలికారు. గెస్ట్ హౌస్ లో కలెక్టర్ రాజర్షి షా, జిల్లా ప్రధాన న్యాయమూర్తి లక్ష్మీ శారద పుష్పగుచ్చం అందజేసి స్వాగతం పలికారు. పోలీసుల గౌరవ వందనం సమర్పించారు. అనంతరం కోర్టు వద్ద పూర్ణ కుంభ స్వాగతం పలికారు. ఈ సందర్బంగా సర్వమత ప్రార్థనలు నిర్వహించారు.