రూ.66 కోట్లతో చిన్నకోడూరు- సిద్దిపేట నాలుగు లైన్ల రహదారి నిర్మాణం: మంత్రి హరీష్ రావు

రూ.66 కోట్లతో చిన్నకోడూరు- సిద్దిపేట నాలుగు లైన్ల రహదారి నిర్మాణం: మంత్రి హరీష్ రావు

ముద్ర  ప్రతినిధి,సిద్దిపేట: చిన్నకోడూరు మండల అభివృద్ధికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర ఆర్థిక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు చెప్పారు చిన్నకోడూరు నుంచి సిద్ది పేటకు నాలుగు లైన్ల రహదారి నిర్మాణం కోసం 66 కోట్ల రూపాయల వ్యయంతో పనులు చేపట్టామని తెలిపారు శనివారం నాడు సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండల కేంద్రంలో 48 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను మంత్రి హరీష్ రావు ప్రారంభించారు జిల్లా పరిషత్ చైర్పర్సన్ రోజా రాధాకృష్ణ శర్మ తో కలిసి లబ్ధిదారుల లబ్ధిదారులతో మంత్రి గృహప్రవేశాలు చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూఒక పైసా ఖర్చు లేకుండా,ఒక చెమట చుక్క రాల్చకుండా48 మందికి  అద్భుతమైన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను కట్టించి లబ్ధిదారులకు అందజేశామన్నారు.

గతంలో ప్రభుత్వం 40, 50 వేలు ఇచ్చి ఇల్లు కట్టుకోమనేది.ఆ పైసలతో ఇల్లు పూర్తికాక అప్పుల పాలు కావాల్సి వచ్చేది.అంతేకాకుండా ఆ డబ్బుల కోసం బ్యాంకుల చుట్టూ తిరగవలసి వచ్చేది. కానీ ఇప్పుడు పైసా ఖర్చు లేకుండా, కష్టపడకుండా అద్భుతమైన ఇండ్లు ఇస్తున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కుతుందన్నారు. చిన్నకోడూరు మండలంలో 479 మందికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను ఇచ్చామని మరో వారం రోజుల్లో చౌడారంలో కూడా లబ్ధిదారులకు అందజేస్తామన్నారుఇంకా ఇండ్లు లేని పేదవారు ఉంటే సొంత జాగలోనే ఇళ్ళు కట్టుకునేలా రూ.3లక్షలు రూపాయలు ఇండ్ల నిర్మాణం కోసం అందజేస్తామని మంత్రి తెలిపారు.

జిల్లా పరిషత్ చైర్పర్సన్ రోజా రాధాకృష్ణశర్మ మాట్లాడుతూ ఒక్క పైసా ఖర్చు లేకుండా పారదర్శకంగా గ్రామ పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను అందించిన సీఎం కేసీఆర్ కు, మంత్రి తన్నీరు హరీష్ రావుకు పేద ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలిపారు.ఒకప్పుడు ఇల్లు కట్టుకోవాలంటే అప్పుల పాలు కావాల్సి వచ్చేద న్నారు .ఇప్పుడు ప్రభుత్వమే పైసా ఖర్చు లేకుండా ఉచితంగా ఇల్లు కట్టించి కరెంటు, త్రాగునీరు,రోడ్డు, డ్రైనేజీ అన్ని సౌకర్యాలను ఇప్పటి ప్రజల అదృష్టం అన్నారు. ఈ కార్యక్రమంలో మండల ప్రజా ప్రతినిధులు, అధికారులు, భారత రాష్ట్ర సమితి నాయకులు పాల్గొన్నారు.