బీ.అర్.ఎస్ నాయకులకు కాంట్రాక్టర్ కమిషన్లు ఇవ్వలేకనే పనులు ఆపేశారా...!

బీ.అర్.ఎస్ నాయకులకు కాంట్రాక్టర్ కమిషన్లు ఇవ్వలేకనే పనులు ఆపేశారా...!
  • అర్ధ నగ్నంగా బిజెపి నాయకుల నిరసన
  •  జిల్లా బిజెపి కిషన్ మోర్చా అధ్యక్షులు కోడిపల్లి గోపాల్ రెడ్డి

కోరుట్ల ముద్ర న్యూస్: కథలాపూర్ స్థానిక బీ అర్ ఎస్ నాయకులకు కాంట్రాక్టర్ కమిషన్ ఇవ్వలేకనే సిరికొండ, తక్కలపెల్లి గ్రామాల మధ్య బ్రిడ్జి నిర్మాణ పనులను నిలిపివేశారా అని ప్రశ్నిస్తు బిజెపి మండల శాఖ ఆధ్వర్యంలో బ్రిడ్జి వద్ద అర్థ నగ్నంగా ప్రదర్శన చేపట్టి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ  తక్కలపల్లి,సిరికొండ బ్రిడ్జి నిర్మాణ పనులను వెంటనే చేపట్టాలని బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేయాలని కోరారు.  పాలకులకు ఎమ్మెల్యేకు వెంటనే అసంపూర్తిగా ఉన్న నిర్మాణ పనులు చేపట్టాలని శిలాఫలకానికి  పాలాభిషేకం కొబ్బరికాయలు కొట్టారు. అదేవిధంగా  బిజెపి కిసాన్మోర్చా జిల్లా అధ్యక్షుడు కోడిపల్లి గోపాల్ రెడ్డి మాట్లాడుతూ 2016లో ఆర్భాటంగా చేపట్టిన బ్రిడ్జి నిర్మాణo అర్ధాంతరంగా ఆగిపోవడానికి కారణం ఎవరాన్నరు? బ్రిడ్జి నిర్మాణం చేపట్టిన కాంట్రాక్టర్ కు డబ్బులు ప్రభుత్వం ఇవ్వకపోవడం ఆ, కాంట్రాక్టర్ పాలకులకు లంచాలు ఇవ్వకపోవడం తోనేనా! ప్రజలకు అర్థం కావడం లేదనీ ముఖ్యంగా తక్కలపల్లి గ్రామ ప్రజలు విద్యార్థులు మండల కేంద్రానికి రావడానికి అనేక ఇబ్బందులు పడుతున్నారనీ,రానున్న వర్షాకాల సీజన్లో మళ్లీ కోరుట్ల మీదునుండో లేదా బొమ్మెన మీదుగా నుండో రావాల్సిన పరిస్థితి ఉంది.

భారతీయ జనతా పార్టీ అనేక మార్లు ఎమ్మెల్యేకు మరియు నిరసన కార్యక్రమాలను చేపట్టిన చీమ కుట్టి నట్టు లేదని అన్నారు. కానీ బ్రిడ్జి పనులను రెండు,మూడు రోజుల్లో పనులు ప్రారంభిస్తామని ప్రజలకు చెప్పుతూ స్థానిక ప్రజాప్రతినిధులు గొప్పలు చెప్పుకోవడమే తప్ప బ్రిడ్జి పనులు మొదలు కావడం లేదన్నరు. స్థానిక ఎమ్మెల్యే ఇకనైనా కథలాపూర్ మండల ప్రజలపై ఏమైనా ప్రేమ ఉంటే వెంటనే బ్రిడ్జి నిర్మాణ పనులను చేపట్టాలనీ డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ మొలిగే లక్ష్మి శ్రీనివాస్, బిజెపి నాయకులు రచమడుగు వెంకటేశ్వరరావు, బద్రి సత్యం, గండ్ర విజయరావ్, గంగారెడ్డి, బీజేవైం జిల్లా ఉపాధ్యక్షుడు మల్యాల మారుతి, గాంధారి శ్రీనివాస్,మండల ఉపద్యక్షడు నరేడ్ల రవీందర్ రెడ్డి, శ్రీరాముల ప్రకాష్,మిట్టపల్లి లింగారెడ్డి, జైపాల్ లింగారెడ్డి, జిల్లా సత్యం,గుండేటి సురేష్, నవీన్, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు తదితులున్నారు.