సీఎం కప్ క్రీడా ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్లు

సీఎం కప్ క్రీడా ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్లు

సిద్దిపేట : ముద్ర ప్రతినిధి: సిఎం కప్ జిల్లా స్థాయి క్రీడలపోటీలలో భాగంగా సిద్దిపేట పట్టణంలోని ప్రభుత్వ డిగ్రి కళాశాల మైదానంలో ఈ నెల 22 నుండి 24 వరకు 3రోజులు పాటు క్రీడలను నిర్వహించడానికి కావలసిన ఏర్పాట్లను జిల్లా అదనపు కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ తో కలిసి జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జే పాటిల్ క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ఈ క్రీడలలో 7 రకాల అటలను నిర్వహించనున్నట్లు డివైఎస్ఓ నాగేందర్ కలెక్టర్ కు తెలిపారు. ఏర్పాట్లు మొత్తం 21వ తెది సాయంత్రం లోపు పూర్తి చేయ్యాలన్నారు.

తాగునీటి వసతి మరియు మొబైల్ టాయిలెట్లను ఉంచాలని మునిసిపల్ కమిషనర్ సంపత్ కుమార్ కు తెలిపారు. క్రీడలు జరుతున్న రోజులు అవసరమైన మందులతో మెడికల్ సిబ్బందిని ఉంచాలని డిఎంఎచ్ఓ డా. కాశీనాథ్ కు తెలిపారు. క్రీడలకు బందోబస్తు ఏర్పాటు చెయ్యాలని పోలిస్ అధికారులకు తెలిపారు.ఆయా మండలాల నుండి వచ్చే క్రీడా కారులకు మరియు ప్రతి ఒక్కరికీ అర్థం అయ్యే విదంగా సైన్ బోర్డులు పెట్టాలన్నారు.