రేషన్ డీలర్లకు 30వేల గౌరవ వేతనం ఇవ్వాలి

రేషన్ డీలర్లకు 30వేల గౌరవ వేతనం ఇవ్వాలి
  • జూన్ 5 నుండి సమ్మె
  • మెదక్ జిల్లా అధ్యక్షులు  ఆనంద్ కుమార్

ముద్ర ప్రతినిధి, మెదక్: రేషన్ డీలర్లకు కనీస వేతనం 30వేలు ఇవ్వాలని మెదక్ జిల్లా రేషన్ డీలర్ల సంఘం ఆధ్వర్యంలో మంగళవారం జిల్లా అదనపు కలెక్టర్ రమేష్ కు వినతిపత్రం అందజేశారు. అధ్యక్షుడు ఆనంద్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలోని రేషన్ డీలర్ల సమస్యలు పరిష్కరించాలని జూన్ 5 నుండి సమ్మె చేస్తున్నట్లు తెలిపారు. పది లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ ఇవ్వాలని దిగుమతి హమాలీ ప్రభుత్వమే భరించాలని రాష్ట్రంలోని ప్రతి ఎంఎల్ఎస్ పాయింట్ వద్ద వే బ్రిడ్జిలు ఏర్పాటు చేయాలని శాశ్వత లైసెన్స్ ఇవ్వాలని ప్రధాన డిమాండ్ తో సమ్మె చేస్తున్నామన్నారు. కరోనా సమయంలో చనిపోయిన 99 మంది డీలర్లకు ఎటువంటి నియమ నిబంధన లేకుండా డీలర్ నియమించాలని కారుణ్య నియామకాల్లో 50 సంవత్సరాలకు పెంచాలని ఇతర నిత్యవసర సరుకులు ఇవ్వాలని, చనిపోయిన రేషన్ డీలర్కు దహన సంస్కారాలకు 50 వేలు ఇవ్వాలని ఆయన  డిమాడ్ చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి రేషన్ డీలర్ల న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి సుధాకర్, వెల్దుర్తి మండల అధ్యక్షులు షేకులు, చేగుంట మండల అధ్యక్షులు శ్రీనివాస్, శివంపేట్ మండల అధ్యక్షులు పాపయ్య చారి, మెదక్ మండల అధ్యక్షులు బిక్షపతి, మాసాయిపేట మండల అధ్యక్షులు ముజీబ్, మెదక్ పట్టణ అధ్యక్షులు విజయ్, నర్సాపూర్ మండల అధ్యక్షులు నర్సింలు, కౌడిపల్లి మండల అధ్యక్షులు శంకరయ్య, చిలిపిచెడ్ మండల అధ్యక్షులు అంతాగౌడ్, పెద్ద శంకరంపేట మండల అధ్యక్షులు కిష్టయ్య, రేగోడు మండల అధ్యక్షులు ప్రభాకర్, నాయకులు బిక్షపతి, ప్రకాష్, కృష్ణమూర్తి, వినోద్ కుమార్, గోవర్ధన్ రెడ్డి, రవి గౌడ్ తో పాటు ఇతర ఇతరులు పాల్గొన్నారు.