మానవత్వానికి చిరునామా ఆ పోలీసు- పలువురి ప్రశంసలు

మానవత్వానికి చిరునామా ఆ పోలీసు- పలువురి ప్రశంసలు

ముద్ర ప్రతినిధి, నిర్మల్: పోలీసు అంటే ఖాకీ దుస్తుల వెనుక ఉన్న కాఠిన్యమే గుర్తుకు వస్తుంది. అయితే ఆ ఖాకీ బట్టల వెనుక సున్నిత హృదయం ఉంటుందని నిరూపించారు నిర్మల్ కు చెందిన మన్సూర్ అహ్మద్. ఆయన మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి కి భద్రతా వలయం లోని ఒక పోలీసు. రోజూ లాగే మంగళవారం కూడా విధుల్లో భాగంగా మంత్రితో పాటు వెళ్లేందుకు మంత్రి నివాసంలో సిద్ధంగా ఉన్నారు. అయితే కొంత దూరంలో కోతిపిల్ల కదలలేని స్థితిలో, తల్లినుండి దూరమై దీనంగా అరుస్తోంది. దీన్ని గమనించిన మన్సూర్ అహ్మద్ వెంటనే ఆ కోతిపిల్ల ను చేతిలోకి తీసుకుని నీళ్ళు తాగించాడు. దీంతో ఆ కోతి పిల్ల కాస్త సేద తీరింది. ఆ వెంటనే ఒక సీసాలో పాలు పోసి పట్టించాడు. కొంత సేపటికి ఆ ప్రాణి గెంతుకుంటూ వెళ్ళిపోయింది. ఈ ఘటన అక్కడే ఉన్న ఆయన తోటి ఉద్యోగులు ఫోటోలు, వీడియోలు తీయటంతో చూసిన ప్రతివారూ ఆయనను అభినందిస్తున్నారు.