కరీంనగర్ పై నిప్పులు కక్కుతున్న భానుడు.. ఆరెంజ్ అలర్ట్ జారీ

కరీంనగర్ పై నిప్పులు కక్కుతున్న భానుడు..  ఆరెంజ్ అలర్ట్ జారీ

ముద్ర ప్రతినిధి, కరీంనగర్ : కరీంనగర్ జిల్లా పై ప్రచండ భానుడు నిప్పులు కురిపిస్తున్నాడు. రాష్ట్రంలోనే కరీంనగర్ జిల్లాలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మంగళవారం మధ్యాహ్నం  తనుగుల 44.3, వీణవంక 43.6, ధర్మారం 41.8, జమ్మికుంట 40.5, మల్యాల 40.2, కరీంనగర్ 39.3, డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతల నమోదు అయ్యాయి. జమ్మికుంట, వీణవంక మండలాల్లోని పలు గ్రామాల్లో అధికారులు ఆరంజ్ అలర్ట్ జారీ చేశారు. అత్యవసర పరిస్థితులు ఉంటే తప్ప బయటకి రావద్దని హెచ్చరిస్తున్నారు. మధ్యాహ్నం 12 గంటల  నుండి  4 గంటల మధ్య ఇండ్ల లోనే ఉండాలని సూచిస్తున్నారు. వచ్చే 20 రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. చిన్నపిల్లలు. వృద్ధులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని కోరుతున్నారు.