అర్హులైన పేదలందరికీ ఇండ్ల స్థలాలు, డబుల్ బెడ్ రూం ఇండ్లను వెంటనే కేటాయించాలి.

అర్హులైన పేదలందరికీ ఇండ్ల స్థలాలు, డబుల్ బెడ్ రూం ఇండ్లను వెంటనే కేటాయించాలి.

ముద్ర, జమ్మికుంట:-ఇల్లంతకుంట మండల కేంద్రంలోని తాసిల్దార్ కార్యాలయం ముందు సిఐటియు, తెలంగాణ రైతు సంఘం, భవన నిర్మాణ సంఘం, కెవిపిఎస్, ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ధర్నా అనంతరం ఇండ్లు ఇండ్ల స్థలాలు ఇవ్వాలని తాసిల్దార్ గారికి దరఖాస్తులు చేయడం జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ రైతు సంఘం జిల్లా కమిటీ సభ్యులు రాము మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక  టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే ఇండ్లు లేని పేద ప్రజలకు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కొట్టిస్తామని చెప్పి  అధికారంలోకి వచ్చాక ఇల్లంతకుంట మండల లో ఒక్క డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కూడా నిర్మించి ఇవ్వలేదు. ఇల్లంతకుంట మండల పరిధిలోని ఇండ్లు, ఇండ్ల స్థలాలు లేని నిరుపేదలందరికీ ఇంటి స్థలాలు కేటాయించి, ఇండ్ల నిర్మాణం పూర్తి అయిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను అర్హులైన పేదలందరికీ తక్షణమే కేటాయించాలి. సొంత జాగా ఉండి ఇల్లు నిర్మించుకునే వారికి ఐదు లక్షల రూపాయలు కేటాయించాలి. లేని యెడల ఇండ్లు, ఇండ్ల  స్థలాలు లేని పేద ప్రజలను కలుపుకొని ప్రభుత్వ భూములో గుడిసెలు వేయించి పూర్తి అయిన డబుల్ బెడ్ రూములను ఆగస్టు 15 నాడు ఇల్లు లేని అర్హులైన పేదలను కలుపుకొని వారితో అక్రమిస్తామని ఈ సందర్భంగా ప్రభుత్వని హెచ్చరిస్తున్నాం తెలంగాణ ప్రజాసంఘాల పోరాట వేదిక ఆధ్వర్యంలో ఇల్లంతకుంట మండల తశీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా అనంతరం పెద్ద ఎత్తున ఇండ్ల స్థలాల వ్యక్తిగత దరఖాస్తులు తహసీల్దార్ గార్కి ఇవ్వటం జరిగింది. ఈ కార్యక్రమంలో కొత్తూరి మల్లయ్య, చిలక రవి, రాజేశ్వరి, సరోజన, రాధమ్మ, గుండ్ల మొగిలి, భోగిని సారయ్య, మారపల్లి ప్రహ్లాద్, లక్ష్మయ్య, ఓదెలు, రమేష్  చాంద్ పాషా, భద్రయ్య, వీరితోపాటు తదితరులు పాల్గొన్నారు.