సమస్యల పరిష్కారానికి ఉద్యమాలే శరణ్యం

సమస్యల పరిష్కారానికి ఉద్యమాలే శరణ్యం

శంకరపట్నం ,ముద్ర జూలై 19 :గ్రామపంచాయతీ సమస్యల పరిష్కారానికి పోరాటాలే శరణ్యమని సిఐటియు జిల్లా అధ్యక్షుడు రాచర్ల మల్లేశం అన్నారు. శంకరపట్నం మండల కేంద్రంలో బుధవారం నాడు గ్రామపంచాయతీ కార్మికులు చేస్తున్న 14వ రోజు సమ్మె శిబిరాన్ని ఆయన సందర్శించారు. అనంతరం మల్లేశం మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నాయని ఆయన ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలను పక్కదారి పట్టిస్తుందని ఆరోపించారు. కార్మికుల పట్ల చిత్తశుద్ధి లేదని ఆయన విమర్శించారు.   రాష్ట్ర ప్రభుత్వం  గ్రామపంచాయతీ కార్మికులను పర్మనెంట్ చేయాలని మల్లేశం డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో అల్వాల జనార్ధన్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం సిఐటియు మండల కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు.అధ్యక్షుడిగా ఎల్కపెళ్లి సారయ్య, ఉపాధ్యక్షులు అంతడుపుల భూమయ్య, కోయడ  సమ్మయ్య, ప్రధాన కార్యదర్శి ఆడెపు శంకర్,  కోశాధికారి చల్లూరి ఎల్లయ్య, డైరెక్టర్లుగా  బొజ్జ ఐలవ్వ,మేకల లత,బండి రమేష్, తాళ్లపల్లి సురేష్,దేవునూరి స్వరూప,రెడ్డి ఓదెలు లను ఎన్నుకున్నారు.