నవాబుపేటలో కంటి వెలుగు కార్యక్రమం ప్రారంభం 

నవాబుపేటలో కంటి వెలుగు కార్యక్రమం ప్రారంభం 

చిగురుమామిడి ముద్ర న్యూస్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు-2 కార్యక్రమాన్ని  చిగురుమామిడి మండలం నవాబుపేటలో బుధవారం గ్రామ సర్పంచ్ సుద్దాల ప్రవీణ్ రిబ్బన్ కట్ చేసి  ప్రారంబించారు.నవాబుపేట గ్రామస్థులు కంటి వెలుగు కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని సర్పంచ్ సూచించారు. ప్రతి మనిషికి కంటి చూపు అనేది ముఖ్యమైనదని దీనిని దృష్టిలో పెట్టుకొని తెలంగాణ ప్రభుత్వం ప్రతి పేదవానికి ఉచితంగా కంటి పరీక్షలు చేసి, కంటికి సంబంధించిన మందులు, కళ్లద్దాలను ఉచితంగా పంపిణీ చేస్తుందని దీనిని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని మండల వైద్యాధికారి ధర్మ నాయక్ కోరారు.అదేవిధంగా ఇప్పటి వరకు ప్రాధమిక ఆరోగ్య కేంద్రం,చిగురుమామిడి పరిధిలో 14,534 మందికి స్క్రీనింగ్ చేయగా,3,218 మందికి రీడింగ్ అద్దాలను అందించడం జరిగిందని అన్నారు.  2,703 మందికి ప్రిస్క్రిప్షన్ అద్దాల కోసం ఆర్డర్ పెట్టగా,  2,173 మందికి ప్రిస్క్రిప్షన్ అద్దాలను అందజేయడం  జరిగిందన్నారు.ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ మంకు స్వప్న శ్రీనివాస్ రెడ్డి,క్యాంప్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ నిర్మల,హెల్త్ సూపర్వైజర్ పద్మ, ఉపసర్పంచ్ ఎలగందుల రాజయ్య,  మండల కో ఆప్షన్ సభ్యులు మాక్బుల్ పాషా, వార్డు సభ్యులు మాడ శ్రీనివాస్, కంతలా లావణ్య,కొడపర్తి స్వప్న, దామ సుగుణ, ఏడెల్లి నిలవ్వ, ఏఎన్ఎం,ఆశలు, అంగన్వాడీ టీచర్స్ , వివోఏ లు తదితరులు పాల్గొన్నారు.