చేవెళ్ల పోలీస్ స్టేషన్ భవనం ప్రారంబించిన హోంమంత్రి మహమూద్ అలీ

చేవెళ్ల పోలీస్ స్టేషన్ భవనం ప్రారంబించిన హోంమంత్రి మహమూద్ అలీ

రంగారెడ్డి జిల్లా చేవెళ్ళ నియోజకవర్గ పట్టన కేంద్రంలో నూతన పోలీస్ స్టేషన్  ను హోం మంత్రి మహమూద్ అలీ, డీజీపీ అంజని కుమార్ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ కార్యమానికి చేవెళ్ళ ఎంపి రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే కాలె యాదయ్య, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ సురభి వాణి, సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర హాజరయ్యారు. 

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హోం మంత్రి మాట్లాడుతూ ఫ్రెండ్లీ పోలీస్ వ్యవస్థ, శాంతి భద్రతలే లక్ష్యంగా తెలంగాణ పోలీస్ ముందు స్థాయిలో ఉందని కితాబు ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతీ జిల్లాలో పోలీసులు ప్రజలకు అందుబాటులో ఉండి నాణ్యమైన సేవలు అందించాలని కోరారు...  మహిళల భద్రతే లక్ష్యంగా ముఖ్యమంత్రి షీ టీం ఏర్పాటు చేయడం వల్ల  క్రైం రేటు పూర్తిగా పడిపోయిందని తెలిపారు. సీసి కెమేరాల ఏర్పాట్లు చేయడంతో  నేరాలను నియంత్రించడంలో తెలంగాణ పోలీస్ పూర్తిగా విజయవంతమైందని ఎంపి రంజీత్ రెడ్డి తెలిపారు.. సైబరాబాద్ పరిధిలోని మొయినాబాద్, శంకర్ పల్లి పోలీస్ స్టేషన్ పునరుద్దరణతో పాటు, పోలీస్ క్వార్టర్స్ లు, కొత్త ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లు నిర్మించాలని ఎమ్మెల్యే కాలె యాదయ్య కోరారు.