జాగృతి తోనే సమర్ధవంతమైన ప్రభుత్వం ఏర్పాటు

జాగృతి తోనే సమర్ధవంతమైన ప్రభుత్వం ఏర్పాటు

నిజామాబాద్ లో ఇఫ్తార్ విందులో అసదుద్దీన్ ఒవైసీ

ముద్ర ప్రతినిధి, కామారెడ్డి: దేశంలో మత తత్వం గల పార్టీ అధికారంలో ఉంటే అభివృద్ధి కుంటుపడుతుందని, సమర్థ వంతమైన ప్రభుత్వం రావాలంటే ప్రజలు జాగృతమై ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని ఎంపీ, ఎం ఐ ఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. గురువారం ఆయన నిజామాబాద్ నగరం లోని కచ్చియా మసీదులో ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం తప్పుడు కేసులతో ఎన్ కౌంటర్లు చేస్తూ, ప్రతిపక్షాలపై కేసులు బనాయిస్తూ పాలన్ సాగిస్తోందని ఆరోపించారు. పవిత్రమైన రంజాన్ మాసంలో ప్రార్థనలు చేస్తు, ఖురాన్ ను పఠిస్తూ గడపాలని, దేశంలో శాంతి భద్రతల కోసం ప్రార్థనలు చేయాలని కోరారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ ఇద్రిస్, సైద్ ఖాన్, హాఫిజ్ లైక్ తదితరులు పాల్గొన్నారు.