కలెక్టరేట్ లో ఘనంగా బతుకమ్మ సంబరాలు

కలెక్టరేట్ లో ఘనంగా బతుకమ్మ సంబరాలు
  • పులను పూజించే గొప్ప సంస్కృతి
  • జిల్లా కలెక్టర్ రాజర్షి షా

ముద్ర ప్రతినిధి, మెదక్:-మెదక్ సమీకృత కలెక్టర్ కార్యలయం àఆవరణలో స్వీప్ ఆధ్వర్యంలో గురువారం బతుకమ్మ సంబరాలు ఘనంగా  జరిగాయి. ముఖ్య అతిధిగా జిల్లా కలెక్టర్ రాజర్షి షా, జిల్లా ఎస్పీ రోహిణి ప్రియదర్శిని పాల్గొన్నారు. ఈ సందర్భంగా  జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా ప్రజలకు బతుకమ్మ శుభకాoక్షలు తెలిపారు.

బతుకమ్మ పండుగ గొప్పదనం గురించి, పూలను  పూజించే గొప్ప సంస్కృతి తెలంగాణలో ఉందనన్నారు. ఓటరు నమోదు కార్యక్రమంలో   బిఎల్ఓల పాత్ర మరువలేనిదని కొనియాడారు. జిల్లా ఎస్పీ రోహిణి ప్రియదర్శిని మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారు. ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.  బతుకమ్మ అనంతరం ఓటరు ప్రతిజ్ఞ చేశారు.  ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా ,ఎలాంటి బయనికి  లోను కాకుండా ఓటు వేయాలని ప్రతిజ్ఞ చేశారు. స్వీప్ అధ్వర్యంలో  అటల, పోటీలు నిర్వహించి గెలిచిన మహిళలకు బహుమతుల ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు వెంకటేశ్వర్లు, రమేష్, డిఆర్ఓ పద్మ శ్రీ, డిడబ్ల్యూఓ బ్రహ్మాజీ, సిడిపిఓ స్వరూప, ఏసిడిపిఓ వెంకటరమణ,  అంగన్వాడి టీచర్స్, ఆయాలు ,ఆశ కార్యకర్తలు, ఎన్నికల సిబ్బందిపాల్గొన్నారు.