రాస్తారోకో.... రైతులు-ప్రయాణికుల మధ్య వాగ్వాదం

రాస్తారోకో.... రైతులు-ప్రయాణికుల మధ్య వాగ్వాదం

ముద్ర ప్రతినిధి, మెదక్: ధాన్యం కొనుగోలు చేయడం లేదంటూ రైతులు ధర్నా, రాస్తారోకో  చేయగా రైతులకు, ప్రయాణికులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. సోమవారం మెదక్ జిల్లా నర్సాపూర్ చౌరస్తా వద్ద మెదక్- హైదరాబాదు రోడ్డుపై గత పది రోజుల నుండి వరి ధాన్యం కొనుగోలు చేయడం లేదంటూ ధర్నా, రాస్తారోకోతో గంటపాటు భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ధర్నా నిర్వహిస్తున్న రైతుకు ప్రయాణికుడు చెప్పు చూపించాడని  అభియోగిస్తు రైతులు, ప్రయాణికులకు మధ్య తోపులాట, నెలకొంది. వాగ్వాదం.

సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు రైతులకు నచ్చజెప్పి గొడవ సద్దుమణిగేలా  చేశారు. రైతుకు ప్రయాణికుడు క్షమాపణ చెప్పడంతో ప్రయాణికులను వదిలేశారు. కష్టపడి పంట పండిస్తే అమ్ముకుందామంటే రోడ్డుపై ధర్నాలు చేయాల్సి వస్తుంది, ఎండలో తిండి, నీళ్లులేక రాత్రి, పగలు కొనుగోలు కేంద్రాల వద్ద 15 రోజుల నుండి పడిగాపులు కాస్తున్నా ఎవరు పట్టించుకోవడం లేదంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.