వైభవంగా కుంకుమార్చనలు.

వైభవంగా కుంకుమార్చనలు.

పెద్దశంకరంపేట, ముద్ర:పెద్దశంకరంపేట పట్టణంలోని తిర్మలాపురంలోనీ దేవీ మండపం వద్ద నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దుర్గామాత విగ్రహం ముందు మంగళవారం నాడు మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చి ప్రత్యేకపూజలు, కుంకుమార్చనలు నిర్వహించారు. దేవీ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా మహిళలు అధికసంఖ్యలో తరలి వచ్చి వేదబ్రాహ్మణ పండితుల మంత్రోశ్చరణల మధ్య ప్రత్యేక పూజలు నిర్వహించి సామూహిక కుంకుమార్చనలు చేశారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, పాడి పంటలు బాగా పండాలని భగవంతున్ని ప్రార్ధించారు. అనంతరం అమ్మవారికి ఓడిబియ్యాలు సమర్పించి తమ తమ మొక్కులు చెల్లించుకున్నారు.పెద్దశంకరంపేటలో దుర్గామాత వద్ద సామూహిక కుంకుమార్చనలు చేస్తున్న మహిళలు.