బతుకమ్మ సందడి

బతుకమ్మ సందడి
  • బతుకమ్మ సందడి
  • వాడ వాడల్లో ఎంగిలి పూల బతుకమ్మ

ముద్ర ప్రతినిధి, మెదక్:
బతుకమ్మ సంబురాలు మొదలయ్యాయి. 
మెదక్​ జిల్లాలోని పట్టణాలు, గ్రామాల్లో వాడ వాడల్లో బతుకమ్మ సంబురాలు మహిళలు ఘనంగా జరుపుకొంటున్నారు. మహాలయ అమావాస్య రోజు ఎంగిలి పూల బతుకమ్మ పేర్చి మహిళలు, బాలికలు బతుకమ్మ ఆట పాటలతో ఆడిపాడారు. గ్రామాల్లో గ్రామ కూడళ్ళలో  బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో... నీ బిడ్డ పేరేమి ఉయ్యాలో అంటూ
లయ బద్దంగా తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా పూలను కొలిచారు.  అనంతరం ఆయా చెరువులు, కుంటల్లో నిమజ్జనం చేశారు.