మరోసారి ఆశీర్వదించండి... మెదక్మరింత అభివృద్ధి చేస్తా

మరోసారి ఆశీర్వదించండి... మెదక్మరింత అభివృద్ధి చేస్తా
  • మెదక్ రోడ్ షోలో టిఆర్ఎస్ అభ్యర్థి పద్మాదేవేందర్ రెడ్డి

ముద్ర ప్రతినిధి, మెదక్:మరోసారి ఆడబిడ్డగా ఆదరించి ఆశీర్వదించండి... మెదక్ ను మరింత అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తానని బిఆర్ఎస్ అభ్యర్థి ఎం. పద్మాదేవేందర్ రెడ్డి ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఎన్నికల ప్రచారం ముగింపులో భాగంగా మంగళవారం మధ్యాహ్నం మెదక్ పట్టణంలో రోడ్ షో నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ... తెలంగాణ ఉద్యమంలో 14 సంవత్సరాలపాటు పోరాటం చేసి కెసిఆర్ నేతృవంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి సంక్షేమం, అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లడం జరుగుతుందన్నారు.

కేసీఆర్ ఇచ్చిన మాట ప్రకారం మెదక్ జిల్లా కేంద్రం చేసి సొంత భవనాలను నిర్మించుకోవడం జరిగిందన్నారు. రైల్వే లైన్ ఏర్పాటుతో పాటు అధునాతన సౌకర్యాలతో ఎంసిహెచ్ ఆసుపత్రి నిర్మాణం చేశామన్నారు. 180 కోట్లతో మెడికల్ కళాశాల, 500 బెడెడ్ ఆసుపత్రి, నర్సింగ్ కళాశాల ఏర్పాటు కానుందన్నారు. కాంగ్రెస్ హయాంలో కరెంటు కష్టాలు చూసినం, కెసిఆర్ వచ్చాక 24 గంటల కరెంటు ఇస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. రేవంత్ రెడ్డి 3 గంటల కరెంటు చాలంటూ హేళన చేశాడు. కెసిఆర్ హయాంలో తాగు, సాగు నీటి కష్టాలు తీర్చింది సీఎం కెసిఆర్ అన్నారు. మెదక్ లో కొత్త జిల్లా కార్యాలయాలు, లైబ్రరీ నిర్మాణం, రైల్వే లైన్ కట్టిన విషయాన్ని గుర్తు చేశారు. రైతులు కష్టాలు తీర్చేలా రైతు బందు, భీమా ఇస్తున్నట్లు తెలిపారు. పింఛన్లు కూడా 5000 కు పెంచడం జరుగుతుంది, ఆడపిల్ల పెళ్ళికి కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ రెండు లక్షలు ఇవ్వనున్నట్లు తెలిపారు. 300 కోట్లతో రింగ్ రోడ్, చౌరస్థ ఆధునీకరణ చేస్తామన్నారు.

50 కోట్లతో కుల సంఘాల భవనాలు, మౌలిక వసతులు కల్పిస్తామన్నారు. ముస్లిం షాదీ ఖానాకు రెండున్నర కోట్లు, క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ కు రెండున్నర కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. గతంలో రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా పనిచేసిన మైనంపల్లి హన్మంత్ రావు మెదక్ ప్రజలకు చేసిందేమి లేదన్నారు. మెదక్ నచ్చ మల్కాజిగిరి పారిపోయాడన్నారు. కొడుకుకు టికెట్ ఇవ్వకపోతే కాంగ్రెస్ కు పోయిన దుర్మార్గుడన్నారు. హన్మంత్ రావుకు తిట్లు, ఓట్లు తప్ప ఎం రావన్నారు. వయసుతో సంబంధం లేకుండా మాట్లాడారని పేర్కొన్నారు. సంస్కారంతో మాట్లాడాల్లన్నారు. తనవల్ల ఏమన్నా తప్పులు జరిగినా పెద్ద మనసుతో ఆశీర్వదించి ఓటేసి గెలిపించాలని పద్మ దేవేందర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ సభలో  పార్టీ ఇంచార్జ్ తిరుపతిరెడ్డి,  మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, వైస్ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్, ఎఎంసి చైర్మన్ బట్టి జగపతి,  మున్సిపల్ కౌన్సిలర్లు, నాయకులు మ్యాడం బాలకృష్ణ, గంగాధర్, రాగి వనజ అశోక్, మేడి కళ్యాణి మధుసూదన్ రావు, బొద్దుల రుక్మిణి సంతోష్, జయశ్రీ దుర్గాప్రసాద్, అంజద్, మామిళ్ళ ఆంజనేయులు, మాయ మల్లేశం తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. బోనాలు, బతుకమ్మలతో స్వాగతం పలికారు.

వార్డుల్లో ప్రచారం

మెదక్ పట్టణంలో 5, 15,30,31,32 వార్డుల్లో పద్మ దేవేందర్ రెడ్డి ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి  ఓటేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. మంగళహారతులతో స్వాగతం పలికారు.