పైళ్లను భారీ మెజార్టీతో గెలిపించాలి:  చింతల 

పైళ్లను భారీ మెజార్టీతో గెలిపించాలి:  చింతల 

ముద్ర ప్రతినిధి భువనగిరి :భువనగిరి నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఫైళ్ళ శేఖర్ రెడ్డి గెలుపే లక్ష్యంగా భువనగిరి పట్టణ రాయగిరి 3వ ,4వ వార్డు లో  బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు చింతల వెంకటేశ్వర్ రెడ్డి మంగళవారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్రిపుల్ ఆర్ బాధితులు అపోహలకు పోవద్దని కాంగ్రెస్, బిజెపి కల్లబొల్లి మాటలు నమ్మొద్దనిఅన్నారు.  శేఖర్ రెడ్డి  మూడోసారి ఎమ్మెల్యే అయిన తర్వాత అందరికీ న్యాయం జరిగేలా చూస్తానని అన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో మూడవసారి ముఖ్యమంత్రి కేసీఆర్ కావాలి అంటే భువనగిరి కోట పైన బీఆర్ఎస్ పార్టీ శేఖర్ రెడ్డి కారు గుర్తు జెండా ఎగరవేయాలన్నారు. రైతుబంధును పుట్టించిన నాయకుడు కేసీఆర్ అని అన్నారు. రైతుబంధు కావాలా రైతుబంధును అడ్డుకునే కాంగ్రెస్ నాయకులు కావాలా అని అన్నారు. ఈ నెల 30వ తేదీన జరిగే ఎన్నికల్లో శేఖర్ రెడ్డి ని అత్యధిక ఓట్లు వేసి గెలిపించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు కోలుపుల అమరేందర్, భువనగిరి సింగిల్ విండో చైర్మన్ నోముల పరమేశ్వర్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ చింతల కిష్టయ్య,కౌన్సిలర్ నాయిని అరుణాపూర్ణ చందర్, బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు కుతాడి సురేష్,వళ్ళపు విజయ్, గ్రామ శాఖ అధ్యక్షులు గ్రామ యువకులు అరవింద్,నరేష్,శ్రావణ,  కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీ అభిమానులు, దోశపటి హరీష్,నాగారం నరేష్ పాల్గొన్నారు.