యూనివర్సిటీ వాలీబాల్ పోటీలలో ప్రథమ స్థానం పొందిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి కళాశాల

యూనివర్సిటీ వాలీబాల్ పోటీలలో ప్రథమ స్థానం పొందిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి కళాశాల

ముద్ర ప్రతినిధి భువనగిరి :మహాత్మా గాంధీ యూనివర్సిటీ వాలీబాల్ పోటీలలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి కళాశాలప్రథమ స్థానాన్ని పొందిన్నట్లు ప్రిన్సిపల్ డాక్టర్ ఎన్ శ్రీనివాస్ తెలిపారు. నవంబరు 17 18 19  తేదీలలో మహాత్మా గాంధీ యూనివర్సిటీ నల్లగొండ పరిధిలో జరిగిన అంతర్ కళాశాలల వాలీబాల్ పోటీలలో సుమారు 20 టీములు పాల్గొన్న ఈ టోర్నమెంట్ లో ప్రథమ స్థానం పొందడం విశేషమన్నారు.

తమిళనాడులోని ఎస్ఆర్ఎం యూనివర్శిటీలో డిసెంబర్ 23 నుంచి 27 వరకు జరగబోయే సౌత్ జోన్ యూనివర్సిటీ స్థాయి టోర్నమెంట్లలో మన యూనివర్సిటీ తరఫున వాలీబాల్ టీం లో కళాశాలకు చెందిన నలుగురు క్రీడాకారులు ఎంపిక కావడం హర్షించదగినదని కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ జి. రమేష్ కొనియాడారు.డిగ్రీ విద్యార్థులైన అనిల్,  గణేష్, సాయి తేజ,అరుణ్ కుమార్,  విజయ్ కుమార్ లను కళాశాల ఫిజికల్ డైరెక్టర్  బి. పాండురంగం ప్రత్యేక శిక్షణ నిచ్చి యూనివర్సిటీ స్థాయి పోటీలకు సంసిద్ధం చేశారు.కళాశాల కార్యదర్శి రావి సుఖేష్ రెడ్డి బి. పాండురంగంని, క్రీడాకారులను ప్రత్యేకంగా అభినందించారు. గెలుపొందిన క్రీడాకారులను కోఆర్డినేటర్ పి. బాల్ రెడ్డి, కే. కిష్టయ్య, ఎన్. సుధ సిబ్బంది అభినందించారు.