అధికారంలోకి వచ్చిన మూడవ రోజు నుండే కొండపైకి ఆటో కార్మికులకు అనుమతి...
- సునీతను భారీ మెజార్టీతో గెలిపించండి: యాదగిరిగుట్టలో కెటిఆర్ రోడ్ షోలో మంత్రి కేటీఆర్
యాదగిరిగుట్ట, ముద్ర :బిఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన మూడవ రోజు నుండే కొండపైకి ఆటో కార్మికులకు అనుమతి ఇస్తామని రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు హామీ ఇచ్చారు. సోమవారం యాదగిరిగుట్టలో ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్ షో నిర్వహించారు. పట్టణ పురవీధులు గులాబీ మయంగా మారాయి. కేటీఆర్ రోడ్ షోను పట్టణ ఆటో కార్మికులు ఆపి నిరసన వ్యక్తం చేయగా మంత్రి కేటీఆర్ ఆటో కార్మికులను ఉద్దేశించి మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన మూడవ రోజు నుండి కొండపైకి ఆటో కార్మికులకు అనుమతి ఇస్తానని వారికి హామీ ఇచ్చారు. అనంతరం ప్రజలనుదేశించి కేటీఆర్ మాట్లాడుతూ మూడవసారి బిఆర్ఎస్ అధికారంలోకి వస్తే రైతు బీమా , బీసీ బందు , 24 గంటల ఉచిత కరెంటు ఇస్తామని రైతులకు భరోసా కల్పించారు.
బస్వాపూర్ డ్యామ్ ఆనుకొని ఉన్న దాతారుపల్లి గ్రామంలో అత్యంత విశాలమైన వాతావరణంతో కూడిన గ్రీన్ పార్కు ఏర్పాటు చేస్తామని , కాంగ్రెస్ ప్రభుత్వ మస్తే కరువు రాజ్యమేలుతుందన్నారు. మూడవసారి కెసిఆర్ ను గెలిపించుకుంటే మరిన్ని నూతన పథకాలు ప్రవేశపెట్టి రాష్ట్ర ప్రజల క్షేమమే లక్ష్యంగా ముందుకు వెళ్దామని , గృహినీలకు ప్రత్యేకంగా ప్రతినెల 3000 రూపాయల ఆర్థిక సాయం , బిజెపి కాంగ్రెస్ మోసపురి మాటలు నమ్మి మోసపోవద్దని ఆలేరు నియోజకవర్గ ప్రజలను కోరారు. గొంగిడి సునీత మహేందర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రతి తెలంగాణ బిడ్డకు ఉందన్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు బూడిద బిక్షమయ్యగౌడ్ , గొంగిడి మహేందర్ రెడ్డి , జడ్పిటిసి తోటకూర అనురాధ , మండల పార్టీ అధ్యక్షుడు కర్రి వెంకటయ్య , పట్టణ అధ్యక్షుడు పెరిమెల్లి శ్రీధర్ గౌడ్ , పట్టణ కార్యదర్శి బాపట్ల నరహరి , స్థానిక మున్సిపల్ చైర్మన్ , వైస్ చైర్మన్ , కౌన్సిలర్లు వివిధ మండలాల టిఆర్ఎస్ నాయకులు , కార్యకర్తలు, అభిమానులు , గ్రామస్తులు పాల్గొన్నారు.