బోనాలు పోతరాజుల వేషాధారణతో నిరసన తెలిపిన గ్రామపంచాయతీ కార్మికులు

బోనాలు పోతరాజుల వేషాధారణతో నిరసన తెలిపిన గ్రామపంచాయతీ కార్మికులు

గుండాల ఆగస్టు 03 (ముద్ర న్యూస్) గుండాల మండల కేంద్రంలో గ్రామపంచాయతీ కార్మికుల సమ్మె 29 రోజుల ఎంపీడీవో కార్యాలయం ముందు సమ్మె కొనసాగింది ఇందులో భాగంగా బోనాలతో వీరభద్రుని వేషాధారణతో బస్టాండ్ నుండి ఎమ్మార్వో ఆఫీస్ వరకు బోనాలతో నిరసన తెలిపారు ఈ ర్యాలీ లో సిఐటియు నాయకులు సత్యనారాయణ సిపిఎం మండల కార్యదర్శి మద్యపురం రాజులు మాట్లాడుతూ. గ్రామపంచాయతీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం ఎమ్మటే పరిష్కారం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

తమ న్యాయమైన హక్కుల కోసం కార్మికులు చేస్తున్న సమ్మె ను ప్రభుత్వం పట్టించుకోకుండా మొండిగా వ్యవహరించడం తగదన్నారు,న్యాయమైన డిమాండ్లు కనీస వేతనం 19500 ఇచ్చి ప్రమాదంలో చనిపోయిన కార్మికునికి 10 లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని అన్నారు ఉద్యోగ భద్రత కల్పించి,పీఎఫ్ ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని మల్టీ పర్పస్ విధానం రద్దుచేసి వేతనాలు చెల్లించాలని అన్నారు.ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు యమగాని గోపాలు ఇటుకల పరశురాములు సిపిఎం పార్టీ మండల కమిటీ సభ్యులు ఎండి ఖలీల్ శ్రీశైలం గ్రామపంచాయతీ కార్మికులు గిరి బాబు నరసయ్య ఎల్లయ్య మల్లయ్య రామకృష్ణ మల్లేష్ పరుశురాములు మల్లయ్య యాదయ్య భాగ్యమ్మ ఏందిరా ప్రభాకర్ రాములు మథిన్ భాను శ్రీను తదితరులు పాల్గొన్నారు.