సీఎం కొత్త కారుకు యాదాద్రిలో ప్రత్యేక పూజలు

సీఎం కొత్త కారుకు యాదాద్రిలో ప్రత్యేక పూజలు

ముద్ర ప్రతినిధి భువనగిరి: తెలంగాణ సీఎం కేసీఆర్ ఖాతాలో మరో కొత్త కారు చేరింది. శనివారం యాదాద్రిలో సీఎం కొత్త కారు ల్యాండ్ క్రూజర్ కి ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆలయ అర్చకులు, అధికారులు. శివాలయం ఎదురుగా ఉన్న ఆరుబయట సీఎం నూతన వాహనం ల్యాండ్ క్రూజర్ కి  శాస్రోక్తంగా పూజలు నిర్వహించారు. హైదరాబాద్ నుండి యాదాద్రి ఆలయానికి ఎస్కార్ట్ తో  ప్రత్యేక అధికారి వాహనానికి దగ్గరుండి ప్రత్యేక పూజలు చేయించారు. ఈ సమయంలో శివాలయం వైపు ఎలాంటి వాహనాన్ని అనుమతించలేదు.