సమస్యల నిలయంగా ఆలేరు నియోజకవర్గ ప్రభుత్వాసుపత్రి

సమస్యల నిలయంగా ఆలేరు నియోజకవర్గ ప్రభుత్వాసుపత్రి
  • ఆసుపత్రిలో డాక్టర్స్ సిబ్బంది ల, చీపిరి కట్టల కొరత  ఆసుపత్రి ముందు ప్రగతిశీల యువజన సంఘం ధర్నా:పి.వై.ఎల్. 

ఆలేరు ఆగస్టు 16 (ముద్ర న్యూస్):- నియోజకవర్గ కేంద్రంలో ఉండాల్సిన కనీస వైద్య సదుపాయాలు లేకుండా  ప్రభుత్వాసుపత్రి నడుస్తుందని ,నియోజకవర్గ కేంద్రంలో వంద పడకల ఆసుపత్రిని నియమించాలనిప్రగతిశీల యువజన సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి బేజాడి కుమార్ డిమాండ్ చేశారు.ప్రగతిశీల యువజన సంఘం పి.వై.ఎల్ ఆధ్వర్యంలో ప్రభుత్వాస్పత్రుల పరిస్థితిపై సర్వే నిర్వహణలో భాగంగా స్థానిక ఆలేరు నియోజకవర్గ కేంద్రంలోని ఆసుపత్రిని సర్వే చేయడం జరిగింది. సర్వే అనంతరం , సమస్యల పరిష్కరించాలని ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కుమార్ మాట్లాడుతూ సిజనల్ వ్యాధుల నివారణకు ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టాలని అన్నారు.   నియోజకవర్గ కేంద్రంలో ఉన్న ఆసుపత్రిలో  కనీసం ప్రభుత్వ అంబులెన్సు ఉండి దానికి డ్రైవర్ లేడు ,  అంబులెన్స్ కి డ్రైవర్ ని పెట్టె స్థితిలో కూడా ప్రభుత్వం లేదనీ, ఎవరికైనా అత్యవసర వైద్యపరిస్థితి ఏర్పడితే అంబులెన్స్ భువనగిరి నుండి వచ్చే వరకు ఎదురుచూడలనీ, ఈ లోపు జరగవలసిన నష్టం జరుగుతుందని, 24గంటల వైద్య సదుపాయం అని పైకి చెప్తున్నారే తప్ప రాత్రి సమయాల్లో అసలు డాక్టర్లే ఉన్న కూడా వాళ్ళ క్యాబినకే పరిమితం పేషెంట్లను పట్టించుకోవడంలో నిర్లక్ష్యం ఉండడం వలన కేవలం నర్సులతోనే రాత్రి పూట హాస్పిటల్ నడుస్తుందనీ, అలాగే సరైన సిబ్బంది, సదుపాయాలు లేవనీ,  లాబ్స్ పరిస్థితి దారుణంగా ఉందని కేవలం 20 రకాల పరీక్షలు మాత్రమే స్థానికంగా చేస్తున్నారని , మిగతా వాటికోసం భువనగిరి ఏరియా హాస్పిటల్ కి పంపిస్తున్నారని అలాగే  హాస్పిటల్ కి లాబ్ సిబ్బంది ఒక్కరే ఉన్నారనే, వారే స్థానికంగా పరీక్ష నిర్వహించి, వాటి ఫలితాల కోసం భువనగిరికి వెళ్లి రావాలనీ,ఎక్స్ రే, స్కానింగ్ మిషన్స్ ఉన్న ఆ పరీక్షలు నిర్వహించే డాక్టర్స్ లేరు కావాలన్నా,  డెంగ్యూ, మలేరియా లాంటి పరీక్షల చేయాలన్న భువనగిరికి పంపిస్తున్నారని , అదే విధంగా  హాస్పిటల్లో స్థానికంగా రోగులకు పేషంటు అడ్మిట్ అయి రెండు రోజులు కావస్తున్న భోజనం పెట్టడం కూడా లేదు ఒకవేళ పెట్టిన భోజనం కూడా బాగులేదని రోగులు అనేక ఇబ్బందులు గురవుతున్నారని అన్నారు. 

ప్రజలకు ముఖ్యంగా కావాల్సింది ఉచిత వైద్యమని అలాంటి అత్యవసరమైన విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉందనీ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 9 సంవత్సరాలు గడుస్తున్నా కావాల్సిన సదుపాయాలను కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని అన్నారు. తక్షణమే ఆసుపత్రికి అంబులెన్సుని కేటాయించి, ఎమ్మారై, సిటీ,స్కాన్ ను ఏర్పాటు చేయాలని, సదుపాయాలను, అలాగే అన్ని రకాల టెస్టుల ను నిర్వహించాలని అన్నారు లేని పక్షంలో డీఎంహెచ్వో కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు.  ఈ కార్యక్రమంలో పి.వై.ఎల్. జిల్లా అధ్యక్షులు సాధుల శ్రీకాంత్, జిల్లా ఉపాధ్యక్షులు గుండు నరేంద్రబాబు జిల్లా సహాయ కార్యదర్శి చిరబోయిన బాలక్రిష్ణ, డివిజన్ అధ్యక్షులు పాకాల నరేష్ జిల్లా నాయకులు ఇక్కిరి కుమార్,ఆర్.ఉదయ్, శికీలా వెంకటేష్ , అన్ రెడ్డి వేణుగోపాల్ రెడ్డి,కృష్ణ,  నరేష్, రవి, జమాల్ ,అప్రోచ్, వెంకటేష్ ,చిరంజీవి ,రమేష్, వేణుగోపాల్ , లావణ్య ,సరిత తదితరులు పాల్గొన్నారు.