బొల్లేపల్లి భీమలింగం ఖత్వా పై బ్రిడ్జ్ నిర్మించాలి

బొల్లేపల్లి భీమలింగం ఖత్వా పై బ్రిడ్జ్ నిర్మించాలి


ముద్ర ప్రతినిధి భువనగిరి :యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం లోని బొల్లేపల్లి, సంగెం గ్రామాల మధ్యలో గల బీమలింగం ఖత్వా పై బ్రిడ్జి నిర్మించాలని వై ఎస్ ఆర్ తెలంగాణ పార్టీ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు మహమ్మద్ అతహర్ డిమాండ్ చేశారు. గత ఎన్నో సంవత్సరాలుగా మూసీ నది పరివాహక ప్రాంతాలైన యాదాద్రి జిల్లా లోని మండలాలలో భువనగిరి మండలం ఒకటని బొల్లేపల్లి, సంగెమ్ మధ్యలో కల ఖత్వా వద్ద వర్షాలు పడితే మూసీ వాగు పొంగి రోడ్డు పై నుండి వరద ప్రవహిస్తుందని అన్నారు. గత నెలలో కురిసిన భారీ వర్షాలకు రోడ్డు పై నుండి పెద్ద ఎత్తున నీటి ప్రవాహం వలన ఆ రోడ్డు మూసి వేయడం వలన ప్రజల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా భువనగిరి ఎమ్మెల్యే చొరవతీసుకుని భీమలింగం ఖత్వా పై బ్రిడ్జి నిర్మించాలని డిమాండ్ చేశారు.