అర్బన్ కాలనీ దశాబ్దాల నిరీక్షణకు మోక్షం

అర్బన్ కాలనీ దశాబ్దాల నిరీక్షణకు మోక్షం
  • హుస్నాబాద్ రైల్వే అండర్ బ్రిడ్జి నుంచి అర్బన్ కాలనీ వరకు రెండున్నర కోట్లు మంజూరు
  • రైల్వే అధికారులకు వినతులు సమర్పించిన కొలువైన స్పందన
  • ఎమ్మెల్యే ఫైళ్ల సహాకారంతో నేరవేరిన అర్బన్ కాలనీ వాసుల దశాబ్దాల కళా

  భువనగిరి ఏప్రిల్ 3 (ముద్ర న్యూస్) యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని భువనగిరి మున్సిపల్ పట్టణంలోని అర్బన్ కాలనీ ప్రజలకు హుస్నాబాద్ రైల్వే అండర్ అండర్ పాస్ వద్ద నుంచి అర్బన్ కాలనీ వరకు నిర్మించేందుకు ముప్పై పీట్ల సీసీ రోడ్డు నిర్మాణానికి ఎట్టకేలకు మోక్షం లభించింది. త్వరలో నిర్మాణ పనులు మొదలుకానున్నాయని తెలుస్తోంది. భువనగిరి మున్సిపల్ పట్టణంలోని 17వ వార్డు కౌన్సిలర్ చెన్న స్వాతి మహేష్, 15 వ వార్డు కౌన్సిలర్ నజ్యా రెహమాన్, 16వ వార్డు కౌన్సిలర్ ఉమాదేవి, ఒక్కటో వార్డు కౌన్సిలర్ కుసంగుల ఎల్లమ్మ రాజు, అధ్వర్యంలో ఎన్నో ఏళ్ల క్రితం నుంచి పోరాటం చేస్తున్న ఫలితం లేకపోవడంతో భువనగిరి ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్ రెడ్డిని అర్బన్ కాలనీ సమస్యలు వివరించారు. అర్బన్ కాలనీ ప్రజల సమస్యల పరిష్కారం కోసం వార్డు సభ్యుల కోరికా మేరకు ఇక్కడి సమస్యలు మున్సిపల్ పురపాలక శాఖ మంత్రి కేటిఆర్ దృష్టికి తీసుకెళ్లి సమస్యలు పరిష్కారం చేయాలని కోరడంతో రెండున్నర కోట్లు మంజూరు చేసినట్లు వార్డు కౌన్సిలర్ చెన్న స్వాతి మహేష్, నజ్యా రెహమాన్, ఉమాదేవి, కుసంగుల ఎల్లమ్మ రాజు తెలిపారు.

దశాబ్దాల కల..
యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని భువనగిరి మున్సిపల్ పట్టణ శివారులో అర్బన్ కాలనీకి వెళ్లే రోడ్డు మీదుగా రైల్వే లైన్ వెళుతోంది. ఇదే దారిలో హైదరాబాద్,  వరంగల్ వైపు రైల్వే లైన్లు ఉండడంతో అక్కడ రైల్వే గేట్ ఏర్పాటు చేశారు. గతంలోనే రైల్వే లైన్ వద్ద రోడ్డు​ఓవర్ బ్రిడ్జి డిమాండ్‌ తెరపైకి వచ్చింది. కానీ అప్పటి బిఆర్ఎస్ పార్టీకి చెందిన ఎంపీలు, ఇతర పార్టీలకు చెందిన ఎంపీలు సైతం ఎన్నో సార్లు పార్లమెంట్‌‌లో ప్రస్తావించినా రైల్వే అధికారులకు వినతి పత్రం సమర్పించిన సాంక్షన్ కాలేదు. చివరకు భువనగిరి ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్ రెడ్డి చొరవతో అర్బన్ కాలనీ ప్రజలకు రైల్వే సమస్యలు తీర్చేందుకు రోడ్డు నిర్మాణ పనులకు మంజూరు లభించింది. భువనగిరి పట్టణ శివారులోని హుస్నాబాద్ పోవు రైల్వే ఓవర్ బ్రిడ్జి నుంచి అర్బన్ కాలనీకి పోవు రోడ్డు నిర్మాణం పనుల కోసం హెచ్ఎండిఎ గ్రీన్‌‌సిగ్నల్‌‌ ఇచ్చింది.  ఫైనాన్స్ క్లియరెన్స్‌‌తో పాటు పాలన అనుమతులను ఇచ్చింది. రోడ్డు నిర్మాణం పనులకు  రూ.2.50 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేయగా ఇందులో 2.50 కోట్లను రిలీజ్ చేసింది.

పలించిన ఎమ్మెల్యే కృషి: 
ఎట్టకేలకు దశాబ్దాల నిరీక్షణకు మోక్షం లభించనుంది. భువనగిరి మున్సిపల్ పట్టణంలోని తహశీల్దార్ ఆఫీస్ నుండి అర్బన్ కాలనీ వెళ్లే దారిలో ఉన్న రైల్వే గేట్ వద్ద నిత్యం పడిగాపులు కాసే వాహనదారుల కష్టాలు తీరనున్నాయి. ఇక హుస్నాబాద్ రైల్వే అండర్ పాస్ బ్రిడ్జి నుంచి అర్బన్ కాలనీ వరకు రోడ్డు నిర్మాణానికి 2.50కోట్ల రూపాయలు ఫండ్స్ విడుదలయ్యాయి. అర్బన్ కాలనీ ప్రజలు రోజు రైల్వే గేట్ వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి పలుమార్లు తెలంగాణ సీఎం కేసీఆర్, పురపాలక శాఖ మంత్రి కేటిఆర్ దృష్టికి తీసుకువెళ్లారు. దానికి స్పందించిన ముఖ్యమంత్రి హుస్నాబాద్ రైల్వే అండర్ పాస్ బ్రిడ్జి నుంచి రోడ్డు నిర్మాణానికి నిధులు విడుదల చేశారు. గత ప్రభుత్వాల హయాంలో ఎందరో పాలకులు అర్బన్ కాలనీ ప్రజలకు రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణం కోసం హామీలు ఇచ్చినా అది నెరవేరలేదు.

నిధుల మంజూరుతో ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్  రెడ్డి చేసిన కృషి ఫలించింది. దశాబ్దాల కల నెరవేర్చినందుకు భువనగిరి పట్టణ ప్రజలు ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటిఆర్ లతో పాటు ఇందుకు కృషి చేసిన ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాని   17వ వార్డు కౌన్సిలర్ చెన్న స్వాతి మహేష్, 15 వ వార్డు కౌన్సిలర్ నజ్యా రెహమాన్, 16వ వార్డు కౌన్సిలర్ ఉమాదేవి, ఒక్కటో వార్డు కౌన్సిలర్ కుసంగుల ఎల్లమ్మ రాజు తెలిపారు. ఈ కార్యక్రమంలో భువనగిరి మున్సిపల్ చైర్మన్ ఎన బోయిన ఆంజనేయులు భువనగిరి మున్సిపల్ వైస్ చైర్మన్ చింతల కిష్టయ్య  మార్కెట్ చైర్మన్ ఎడ్ల రాజేందర్ రెడ్డి పట్టణ అధ్యక్షులు ఏవి కిరణ్ కార్యదర్శి రచ్చ శ్రీనివాస్ రాచమల్ల రమేష్ కుమారు సుధాకర్ రెడ్డి చెన్న మహేష్ గాదే శ్రీనివాస్ కుశంగల రాజు కడారి వినోద్ గంటపాక జంగయ్య భువనగిరి పట్టణ టిఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.