యువ టీం 5K రన్ టీ-షర్ట్ ఆవిష్కరించిన ఎమ్మెల్యే

యువ టీం 5K రన్ టీ-షర్ట్ ఆవిష్కరించిన ఎమ్మెల్యే

భువనగిరి ముద్ర ప్రతినిధి: యువ టీమ్ ఆధ్వర్యంలో ఈనెల 25వ తేదీ శనివారం డ్రగ్స్, బెట్టింగ్ కి వ్యతిరేకంగా నిర్వహించే 5K రన్, యువ చైతన్యం  ప్రోగ్రాం కి సంబంధించిన టీ-షర్ట్ ని భువనగిరి ఎమ్మెల్యే పైళ్ళశేఖర్ రెడ్డి బుధవారం ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో ఆవిష్కరించారు.  ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఆంజనేయులు, బిఆర్ఎస్  పట్టణ అధ్యక్షులు ఏవి కిరణ్ కుమార్, పట్టణ ప్రధాన కార్యదర్శి రచ్చ శ్రీనివాస్ రెడ్డి,  కౌన్సిలర్లు జిట్టా వేణుగోపాల్ రెడ్డి, వెంకట్, యువర్ టీం కన్వీనర్ సూదగాని  రాజు తదితరులు పాల్గొన్నారు.

 కుంభం అనిల్ కుమార్ రెడ్డి చేతుల మీదుగా....

యువ టీమ్ ఆధ్వర్యంలో  ఈనెల 25వ తేదీ శనివారం డ్రగ్స్, బెట్టింగ్ కి వ్యతిరేకంగా నిర్వహించే 5K రన్, యువ చైతన్యం  ప్రోగ్రాం కి సంబంధించిన టీ-షర్ట్ ని యాదాద్రి భువనగిరి జిల్లా కాంగ్రెస్ అద్యక్షుడు కుంభం అనిల్ కుమార్ రెడ్డి హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని ఆయన స్వగృహంలో బుధవారం ఆవిష్కరించారు. యువ టీం కన్వీనర్ సూదగాని రాజు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో యువ టీం సభ్యులు శీలం విప్లవ్, పొత్నక్ సన్నీ, కుసుమ సాయి తేజ,  పట్నం ప్రణయ్, దేశెట్టి సాయి చరణ్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.