వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్నేహితుల దినోత్సవం.....

వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్నేహితుల దినోత్సవం.....

ఆలేరు (ముద్ర న్యూస్):యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలోని సూర్యోదయ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం నాడు స్నేహితుల దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఒకరికొకరు స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటూ స్నేహితుల దినోత్సవాన్ని ఆనందంగా ఆస్వాదించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మానవ జీవితంలో అత్యంత విలువైనది స్నేహం ఒక్కటేనని అన్నారు. అలాంటి స్నేహానికి చిహ్నంగా స్నేహితుల దినోత్సవాన్ని జరుపుకోవడం ఆనందంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో మంగ నరసింహులు. పూల నాగయ్య. పుట్ట మల్లేష్ గౌడ్ .సరాబ్ సంతోష్ కుమార్. బేతి రాములు. బండి నాగయ్య. రామచంద్రయ్య. దయ్యాల సంపత్. సీసా ప్రభాకర్. ఎగ్గిడి శ్రీశైలం. కుతాటి అంజన్ కుమార్. జూకంటి వెంకటేష్. సముద్రాల కనక భూషణం. శికిలం శ్రీనివాస్. కట్టెగుమ్ముల సాగర్ రెడ్డి. కొలుపుల హరినాథ్. నీలం వెంకటస్వామి తో పాటు తదితరులు పాల్గొన్నారు.