బిఆర్ఎస్ పార్టీలో పలువురు చేరిక

బిఆర్ఎస్ పార్టీలో పలువురు చేరిక

భూదాన్ పోచంపల్లి ,ముద్ర: భూదాన్ పోచంపల్లి మండల పరిధిలోని వంకమామిడి గ్రామానికి చెందిన సుమారు 50 మంది కాంగ్రెస్ కార్యకర్తలు సోమవారం హైదరాబాదులోని భువనగిరి నియోజకవర్గ శాసనసభ్యులు పైళ్ల శేఖర్ రెడ్డి సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరికయ్యారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరినవారు దాసరి లక్ష్మీనారాయణ ,వీరమల్ల యాదగిరి గౌడ్ ,చెక్క శ్రీరాములు ,చెక్క వెంకటేష్ ,దాసరి లింగస్వామి, దాసరి పరమేష్ ,చెక్క లింగస్వామి ,చెక్క వెంకటేష్, చెక్క శంకరయ్య చేరికయ్యారు. అనంతరం మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కెసిఆర్ చేపడుతున్న సంక్షేమ పథకాలు, చేస్తున్న అభివృద్ధి పనులను చూసి బిఆర్ఎస్ పార్టీలో చేరికయ్యామని అన్నారు .

ఈ కార్యక్రమంలో ఎంపీపీ మాడుగుల ప్రభాకర్ రెడ్డి, వైస్ ఎంపీపీ పాక వెంకటేష్ యాదవ్, పిఎసిఎస్ చైర్మన్ కందాడి భూపాల్ రెడ్డి,సర్పంచుల ఫారం మండల అధ్యక్షులు సామ రవీందర్ రెడ్డి, ఎంపిటిసిల ఫారం మండల అధ్యక్షురాలు బత్తుల మాధవి శ్రీశైలం గౌడ్, గ్రామ శాఖ అధ్యక్షుడు బొడిగ మల్లయ్య, వార్డ్ మెంబర్ శివకుమార్, నాయకులు జగన్ ,నరసింహ, చెక్క యాదగిరి ,మచ్చ యాదగిరి, దుర్గ ప్రసాద్, వేణు, వంశీ, చింటూ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.