ప్రైవేట్ పాఠశాలల అధిక ఫీజుల దోపిడీని అరికట్టాలి....

ప్రైవేట్ పాఠశాలల అధిక ఫీజుల దోపిడీని అరికట్టాలి....

విద్యాశాఖ కార్యాలయంలో వినతి పత్రం అందజేసిన నాయకులు.....

ఆలేరు (ముద్ర న్యూస్): తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేట్ పాఠశాలల అధిక ఫీజులను అరికట్టడంలో విద్యాశాఖ అధికారులు మరియు పాలక ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని ఎస్ఎఫ్ఐ మాజీ డివిజన్ కార్యదర్శి మంగ అరవిందు. డివైఎఫ్ఐ జిల్లా నాయకులు ఎలుగల శివ లు ఆరోపించారు. శనివారం నాడు యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలోని మండల విద్యాశాఖ అధికారి కార్యాలయం ముందు వారు ఆందోళన నిర్వహించిన అనంతరం వివిధ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని కార్యాలయ అధికారి చైతన్యకు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యం విద్యార్థుల తల్లిదండ్రుల నుండి అధిక ఫీజులను వసూలు చేయడంతో పేద. మధ్యతరగతి కి చెందిన వారు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం నుండి ఎలాంటి అనుమతులు పొందకుండా డిజిటల్ క్లాసులకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తూ అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు.

నిబంధనల ప్రకారం అధ్యాపకులను నియమించకుండా అర్వత లేని వారిని నియమించుకుంటూ విద్యార్థులకు సరైన పాఠాలను బోధించడంలో ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. పట్టణంలోని అనేక ప్రైవేట్ పాఠశాలల్లో విద్యార్థులకు క్రీడ మైదానాలు లేకపోవడంతో విద్యార్థులు క్రీడలలో రాణించలేకపోతున్నారని చెప్పారు. విద్యార్థుల సంఖ్యకు అనుకూలంగా తరగతి గదులు లేక మౌలిక సమస్యలతో విద్యార్థులు అభ్యసించాల్సిన పరిస్థితి నెలకొన్నదని అన్నారు. ప్రభుత్వం మరియు విద్యాశాఖ అధికారులు వెంటనే స్పందించి ప్రైవేట్ పాఠశాలల లో తనిఖీలు నిర్వహించి. విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే అనేకమంది విద్యార్థులు తమ చదువులను మానుకోవాల్సిన పరిస్థితి ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సుధాగాని నవీన్. మల్లూరి అజయ్. భీమగాని సంపత్. గుడికుంట్ల రమేష్. నీడిగొండ బాలరాజు తోపాటు తదితరులు పాల్గొన్నారు.