ముదిరాజ్ లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కౌశిక్ రెడ్డి పై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన ముదిరాజూలు

ముదిరాజ్ లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కౌశిక్ రెడ్డి పై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన ముదిరాజూలు

ఆలేరు (ముద్ర న్యూస్):ముదిరాజ్ లపై బిఆర్ఎస్ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను బేషరత్ గా ఉపసంహరించుకొని బహిరంగ క్షమాపణ చెప్పాలని ముదిరాజ్ సంఘం నాయకులు డిమాండ్ చేశారు. ఆదివారం నాడు యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలోని కొలనుపాక గ్రామానికి చెందిన ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో ఆలేరు ఏఎస్ఐ రవీందర్ కు ఫిర్యాదును అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇటీవల జి ఎస్ ఆర్ టి వి ఛానల్ కెమెరామెన్ అజయ్ ముదిరాజ్ పై దాడి చేయడంతో పాటు దూషించి మాట్లాడడం మరియు ముదిరాజ్ సమాజాన్ని. ముదిరాజులను అవమానించడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి బేషరతుగా తన వ్యాఖ్యలను ఉపసంహరించుకొని ముదిరాజ్ సమాజానికి బహిరంగ క్షమాపణ చెప్పకుంటే తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. అంతకుముందు కౌశిక్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం నాయకులు. కార్యకర్తలు. ప్రముఖులు. తదితరులు పాల్గొన్నారు....