కానిస్టేబుల్ గా ఎంపికైన సింధుకు సన్మానం 

కానిస్టేబుల్ గా ఎంపికైన సింధుకు సన్మానం 

ముద్ర ప్రతినిధి భువనగిరి :ఇటీవల ప్రకటించిన పోలీస్ కానిస్టేబుల్ ఫలితాల్లో భువనగిరి పట్టణం అంబేడ్కర్ నగర్  కి చెందిన గొనూరి సింధు కానిస్టేబుల్ గా ఎంపిక కావడంతో 2 వ వార్డు  అంబేద్కర్ సంఘం అధ్వర్యంలో సంఘం సభ్యులు సింధు ను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమం అంబేడ్కర్ సంఘం అధ్యక్షులు పొకల యాదగిరి, ప్రధాన కార్యదర్శి గోనురి శ్రీనివాస్, కోశాధికారి తోర్రి సురేష్, పోకల దశరథ, తొర్రి అనిల్, దండు నర్సింహ, నాగారం, నీరజ్, కొంగరి మహేష్, రెంటాల నాగయ్య, మనోహర్, బందెల అరుణ్ పాల్గొన్నారు.