బిజెపి మహిళా మోర్చా ఆలేరు అసెంబ్లీ కన్వీనర్, కో కన్వీనర్ ల నియామకం

బిజెపి మహిళా మోర్చా ఆలేరు అసెంబ్లీ కన్వీనర్, కో కన్వీనర్ ల నియామకం

ముద్ర, యాదగిరిగుట్ట :బిజెపి మహిళా మోర్చా ఆలేరు అసెంబ్లీ కన్వీనర్ గా కొలనపాకకు చెందిన లక్ష్మి, కో కన్వీనర్ లుగా యాదగిరిగుట్టకు చెందిన రంగా రేఖ,అమరాజు శిరీష లు నియమితులయ్యారు. గురువారం రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు గీత మూర్తి రాష్ట్ర కార్యాలయంలో నియామక పత్రాలు అందజేశారు.  ఈ సందర్భంగా  వారు మాట్లాడుతూ తమకు అప్పగించిన బాధ్యతను సక్రమంగా నెరవేర్చుతామని రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు గీత మూర్తి కి ధన్యవాదములు తెలిపారు.