అర్హులైన పేద మైనారిటీ మహిళలందరికీ న్యాయం చేయాలని వినతి

అర్హులైన పేద మైనారిటీ మహిళలందరికీ న్యాయం చేయాలని వినతి

ముద్ర ప్రతినిధి భువనగిరి :రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే మైనారిటీ మహిళల కొరకు కుట్టుమిషన్లు ఇచ్చే కార్యక్రమం మొదలు పెట్టిందో అందులో అర్హులైన ప్రతీ మైనారిటీ మహిళలకు న్యాయం చేయాలని వై ఎస్ ఆర్ తెలంగాణ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం లో పరిపాలన అధికారి నాగేశ్వర చారీ కి వినతి పత్రం అందచేశారు. ఈ సందర్బంగా వై ఎస్ ఆర్ తెలంగాణ పార్టీ యాదాద్రి జిల్లా అధ్యక్షులు మహమ్మద్ అతహర్ మాట్లాడుతూ  భువనగిరి అసెంబ్లీ కి 200 కుట్టు మిషన్లు వచ్చాయని సమాచారం ఉందని కానీ అవి అసెంబ్లీ వ్యాప్తంగా సరిపోవని తెలిపారు. భువనగిరి అసెంబ్లీ వ్యాప్తంగా దాదాపు 50 వేల ముస్లిం మైనారిటీ జనాభా ఉందని అందులో దాదాపు 10 వేలకు పైగా మహిళలు ఉన్నారని అన్నారు .అలాంటప్పుడు 200 కుట్టు మిషన్లు కేవలం బోనగిరి పట్టణం లోని 35 వార్డుల వారికే ఇస్తున్నారని తెలిసిందని మరి నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న వలిగొండ, పోచంపల్లి, బీబీనగర్,భువనగిరి మండలాల వారి పరిస్థితి ఎందని ప్రశ్నించారు. అందువలన  భువనగిరి అసెంబ్లీకి కనీసం ఒక వెయ్యి కుట్టు మిషన్లు పంపిణీ చేసి నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో ఉన్న పేద మైనారిటీ మహిళలుకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమం లో పట్టణ అధ్యక్షులు సాయి నివాస్, మైనారిటీ అధ్యక్షులు వాహేద్ తదితరులు పాల్గొన్నారు.