పోడు భూముల సర్వే పేరుతొ గిరిజనుల ఆగం

పోడు భూముల సర్వే పేరుతొ గిరిజనుల ఆగం
  • మెదక్ ఆత్మగౌరవ యాత్రలో డీసీసీ అధ్యక్షులు కంఠారెడ్డి తిరుపతిరెడ్డి

ముద్ర ప్రతినిధి, మెదక్:గిరిజనులకు మూడెకరాల భూమిని ఇస్తామని... ఉన్న భూమిని ప్రభుత్వం ధరణి వ్యవస్థతో గిరిజనుల కడుపు కొట్టిందని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కంఠారెడ్డి తిరుపతిరెడ్డి ఆరోపించారు.సోమవారం  మెదక్ ఆత్మగౌరవ యాత్రలో భాగంగా హావేలి ఘనపూర్ మండలం  పోచమ్మరల్, పోచమ్మరల్  తండాలలో గడప గడపకు కాంగ్రెస్ కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజలకు ప్రభుత్వం చేస్తున్న అవినీతి గురించి వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే గిరిజనులకు చెందాల్సిన 3 ఎకరాల భూమిని అందజేస్తామని హామి ఇచ్చారు. ప్రభుత్వం పోడుభూముల సర్వే పేరా గిరిజనుల కడుపు కొట్టిందని ఆయన విమర్శించారు.

ప్రభుత్వం ఇస్తున్న రైతు బంధును కాంగ్రెస్ ప్రభుత్వం 5 వేల రూపాయలు ఇస్తామని తెలియజేశారు. బ్యాంకుల్లో ఉన్న అప్పులు ఏ రైతన్న కూడ కట్టవద్దని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మాఫీ చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో పీసీసీ మెంబర్ మామిల్ల ఆంజనేయులు, పల్లె రాంచందర్ గౌడ్, శ్రీనివాస్, గూడూరి ఆంజనేయులు, శ్యాంసుందర్, రామారావు, రాములు, శ్రీనివాస్ గౌడ్, యదగౌడ్, రమేష్, మహేందర్ రెడ్డి, ప్రేమ్ కుమార్, పద్మ రావు, మహేష్ బాబు, చవ్యా, నాయక్, గ్రామస్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.