ఉపాధి హామీలో అమలుచేస్తున్న ప్రతీ పధకాలను సద్వినియోగం చేసుకోవాలి

ఉపాధి హామీలో అమలుచేస్తున్న ప్రతీ పధకాలను సద్వినియోగం చేసుకోవాలి
  • జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి నాగిరెడ్డి 
  • జిల్లా వ్యవసాయ అధికారి అనురాధ.


భువనగిరి జూలై 26 (ముద్ర న్యూస్):- ఉపాధి హామీ ద్వారా అమలు అవుతున్న ప్రతీ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి నాగిరెడ్డి అన్నారు.బుధవారం జిల్లా కేంద్రంలోని పశు సంవర్ధక శాఖ మీటింగ్ హాల్లో యాత్ర సంస్థ పదమూడవ వార్షికోత్సవం సందర్భంగా  ఉపాధి కూలీలు, బీడీ కార్మికుల, గృహ కార్మికుల సామాజిక భద్రతపై సమావేశం జరిగింది. 
ఈ సమావేశానికి యాత్ర సంస్థ డైరెక్టర్ సురుపంగ శివలింగం అధ్యక్షత వహించగా  ముఖ్యఅతిధిగా హాజరైన  డిఆర్డిఓ నాగిరెడ్డి మాట్లాడుతూ ఉపాధి హామిలో అనేక పథకాలు అమలు అవుతున్నాయని వాటన్నిటినీ రైతులు, కూలీలు సద్వినియోగం చేసుకోవాలని, ఇప్పటికే ఈఆర్ధిక సంవత్సరంలో డెబ్భై శాతం పనిదినాలను పూర్తి చేసుకున్నామని అన్నారు.

జిల్లా వ్యవసాయ అధికారి అనురాధ మాట్లాడుతూ రైతు భీమా పథకానికి అర్హులైన రైతులు దరఖాస్తులు చేసుకోవాలని అలాగే సీజన్ ప్రారంభమైనందున వ్యవసాయ మెలకువలు తెలుసుకోవాలని సూచించారు. దానికి స్వచ్ఛంద సంస్థలు ముందుకు వస్తే రైతులకు శిక్షణలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేశారు. జిల్లా వెటర్నరీ అధికారి డాక్టర్ కృష్ణ మాట్లాడుతూ ఉపాధి హామీ పథక ద్వారా పెరటికొల్ల పెంపకం, గడ్డి, చొప్ప మరియు పశువుల, గొర్రెల కొట్టాలు ఏర్పాటు చేయుటకు ముందుకురావాలని సూచించారు.దళిత బహుజన ఫ్రoట్ జాతీయ కార్యదర్శి పి. శంకర్ మాట్లాడుతూ అసంఘటితరంగ కార్మికులు అయిన వ్యవసాయ కూలీలు , బీడీ కార్మికులు, గృహ కార్మికుల యొక్క సంక్షేమం కోసం ప్రభుత్వాలు కృషి చేయాలని, తదనుగూనంగా చట్టాలు, పాలసీలు తీకుకురావలని అన్నారు.ఈ క్రమంలో నిరంతరం గత పదమూడు సంవత్సరాలుగా ఈజిల్లాలో గ్రామీణాభివృద్ధి కోసం  యాత్ర సంస్థ చేస్తున్న కృషి అభినందనీయమని అన్నారు.
అసంఘటిత రంగ కార్మికుల సామాజిక భద్రత కోసం నిరంతర పర్యవేక్షణ అవసరమని అన్నారు.ఈకార్యక్రమంలో శ్రీలోగిల్లు సీఈవో వంటేరు సురేష్ రెడ్డి, సామాజిక ఉద్యమ నాయకులు బట్టు రామచంద్రయ్య, కేసరియూత్ క్లబ్ అధ్యక్షులు రేగు బాలనర్సయ్య,  శ్రీనివాస్ ఎమ్మార్పీఎస్  జిల్లా అధ్యక్షులు దుబ్బ రామకృష్ణ, నీడ్ సంస్థ అధ్యక్షులు శ్రీశైలం లు ప్రసంగించగా.  శ్రమ శక్తి సంఘాల నాయకురాళ్లు సంతోష, స్వప్న, మంజుల, ఊర్మిలమ్మ, బీడీ కార్మికులు లావణ్య , ధనలక్ష్మీ, అంజలి, అనిత , పావని తదితరులు పాల్గొన్నారు.